Top 5 Scooters: పనితీరులో బెస్ట్.. మైలేజ్‌లో హైఎస్ట్: టాప్ 5 స్కూటర్లు ఇవే

Published : May 31, 2025, 07:28 PM IST

Top 5 Scooters: మీకు మైలేజ్ ఎక్కువ వచ్చే స్కూటర్ కావాలా? పెట్రోల్ వేరియంట్ లోనే కాకుండా ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో అధిక మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
యమహా రే ZR 125 Fi హైబ్రిడ్

అధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ స్కూటర్ మీరు కొనాలనుకుంటే యమహా రే ZR 125 Fi హైబ్రిడ్ మీకు పర్ఫెక్ట్ సెలెక్షన్. ఇది దాదాపు 71.33 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఈ స్పోర్టి స్కూటర్ స్టైల్, పనితీరు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మెరుగైన ఇంధన ఆదా కోసం ఇది స్మార్ట్ మోటార్ జనరేటర్‌ను కలిగి ఉంది. 

అంతేకాకుండా అనేక రంగుల్లో లభిస్తుంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ తో వస్తుంది. దీని ధర దాదాపు రూ.86,000(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

25
ఫాసినో 125 Fi హైబ్రిడ్

యమహా నుండి మరో స్మార్ట్ ఎంపిక ఫాసినో 125 Fi హైబ్రిడ్. రే ZR మోడల్ లో ఉన్న అదే ఇంజిన్‌ ఇందులో కూడా ఉంది. ఇది 68.75 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఈ రెట్రో స్టైల్ స్కూటర్ క్లాసిక్ లుక్‌ను ఇష్టపడేవారికి చాలా బాగుంటుంది. 

బ్లూటూత్ కనెక్టివిటీ, సైలెంట్ స్టార్ట్, హైబ్రిడ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉండటంతో పెద్దలకు, యూత్ కి కూడా బాగా నచ్చుతుంది. దీని ధర రూ.80,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

35
TVS XL100

మీకు స్కూటర్ కొనడానికి బడ్జెట్ లిమిట్ ఉందా? అయితే TVS XL100 మీకు సరైన ఎంపిక. ఇది జస్ట్ మోపెడ్ అయినప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 65 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. రూ.47,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్ లో లభిస్తోంది. ఈ దృఢమైన వాహనం బరువులు మోసుకెళ్లడానికి, రోజువారీ ప్రయాణానికి చాలా అనువైనది. ఇది సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంది. మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ETFi టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 

45
హోండా యాక్టివా 6G

6G స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా దూసుకుపోతోంది. దీని పనితీరు అద్భుతం. రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ. అందుకే యాక్టివాను ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇది 59.5 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది. 

సైలెంట్ స్టార్ట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 109cc ఇంజిన్‌ పనితీరు రైడర్లకు చక్కటి అనుభూతిని ఇస్తుంది. ఇది ఫ్యామిలీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది రూ.80,000 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

55
హోండా యాక్టివా e

ఎలక్ట్రిక్ విభాగంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ (యాక్టివా e)కి మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇటీవలే డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్లతో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇది రోజువారీ ఉపయోగానికే కాకుండా, సుదూర ప్రయాణానికి కూడా ఉపయోగపడుతుంది. దాదాపు రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర ఉన్నప్పటికీ, దాని జీరో ఇంధన ఖర్చు, తక్కువ నిర్వహణ ఉంటుందని కంపెనీ తెలిపింది. 

Read more Photos on
click me!

Recommended Stories