బ్లూటూత్ ఫెసిలిటీ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవిగో

First Published | Dec 22, 2024, 5:13 PM IST

ఫోన్‌ని, బండిని కనెక్ట్ చేసేందుకు బ్లూటూత్ డివైజ్ చాలా  అవసరం. ఇది మీకు ప్రయాణంలోనూ ముఖ్యమైన కాల్స్ మాట్లాడటానికి, మెసేజ్ ల ద్వారా ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి, పాటలు వింటూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్లూటూత్ ఫెసిలిటీ అందిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.   

ఫోన్ వాడకుండా, చూడకుండా ఒక్క క్షణమైనా ఉండే పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యంగా జాబ్ చేసే వాళ్లు నిరంతంర ఇంటర్నెట్ వాడాలి. ఫోన్ కాల్స్ మాట్లాడాలి. మెసేజస్, మెయిల్స్ కి రిప్లై ఇవ్వాలి. మరి ప్రయాణంలో ఇవన్నీ బంద్ చేసేయాలి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా అని కాల్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఆగి ఫోన్ మాట్లాడదామంటే ప్రయాణానికి టైమ్ సరిపోదు. అందుకే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇప్పుడు బ్లూటూత్ టెక్నాలజీతో కూడా వస్తున్నాయి.

ఓలా S1 ప్రో, TVS ఐక్యూబ్, ఏథర్ 450X, బజాజ్ చేతక్, హీరో విడా V1. బ్లూటూత్ కనెక్టివిటీ, GPS నావిగేషన్, మెరుగైన పనితీరు, స్మార్ట్ టెక్ ఫీచర్లతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే. 

1. Ola S1 Pro

ఓలా S1 ప్రో జెన్ 2 బ్లూటూత్, వైఫై, GPS వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది హైపర్, నార్మల్, స్పోర్ట్స్, ఈకో వంటి రైడింగ్ ఆప్షన్లు కలిగి ఉంది. 7 ఇంచ్ TFT డిస్ప్లే, LED లైట్లు, 34 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ కొంటే ప్రాక్సిమిటీ లాక్, అన్‌లాక్, బ్లూటూత్ కాల్లింగ్ సౌకర్యాలను మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ లో ఉన్న 4 kWh బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 195 కి.మీ రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. గంటకు 120 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ. 1,44,996 (ఎక్స్-షోరూమ్).


2. TVS Iqube

టీవీఎస్ ఐక్యూబ్ స్మార్ట్‌ఎక్స్‌ కనెక్ట్ టెక్నాలజీతో తయారైంది. ఇది బ్లూటూత్, నావిగేషన్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఎకో, పవర్ రైడింగ్ మోడ్‌ల ద్వారా పనిచేస్తుంది. LED లైటింగ్, TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 32 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న 5.1 kWh బ్యాటరీని ఒకసారి రీఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ వరకు పరుగెడుతుంది. ఇది గంటకు 82 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,08,000 నుంచి రూ. 1,48,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 

3. Ather 450X Gen 3

ఏథర్ 450X జెన్ 3 స్మార్ట్ టెక్నాలజీ, బ్లూటూత్, Wi-Fi కనెక్టివిటీ వంటి సదుపాయాలను కలిగి ఉంది. 7 ఇంచ్ TFT టచ్‌స్క్రీన్, రివర్స్ అసిస్ట్, 22 లీటర్ల బూట్ స్పేస్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని మీరు రైడ్, వార్ప్, స్పోర్ట్స్, ఈకో వంటి మోడ్ లలో నడపచ్చు. ఇది 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఇది 3.75 kWh బ్యాటరీని కలిగి ఉండటం వల్ల ఒకసారి ఛార్జ్ 110 కి.మీ రేంజ్ వరకు పరుగెడుతుంది. దీని ధర రూ.1,30,000 - రూ.1,50,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 

4. Hero Vida V2

7 ఇంచ్ TFT డిస్ప్లే, LED హెడ్‌ల్యాంప్స్, 26 లీటర్ల బూట్ స్పేస్ వంటి చక్కటి ఫీచర్లు కలిగి ఉన్న హీరో విడా స్కూటర్ V2 బ్లూటూత్, GPS కనెక్టివిటీతో తయారైంది. ఈ స్కూటర్ లో ఈకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే రైడింగ్ మోడ్ లు ఉన్నాయి. 3.94 kWh బ్యాటరీని కలిగి ఉన్న ఈ స్కూటర్ 165 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించగలదు. గంటకు 90 కి.మీ గరిష్ఠ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర మార్కెట్ లో రూ.96,000 - రూ.1,35,000 (ఎక్స్-షోరూమ్)మధ్య ఉంది.  

5. Simple One 

7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఇన్‌బిల్ట్ నావిగేషన్ సిస్టమ్ కలిగిన సింపుల్ వన్ స్కూటర్ మార్కెట్ లో ఎక్స్ షోరూమ్‌లో రూ.1,45,000 నుంచి రూ.1,58,000 మధ్య ధర పలుకుతోంది.  7 ఇంచ్ టచ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, ఆఫ్‌లైన్ మ్యాప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 

Latest Videos

click me!