ఈ 5 Banksలో Fixed Deposit చేస్తే డబ్బులే డబ్బులు

First Published | Aug 14, 2024, 1:38 PM IST

చాలామంది తమ డబ్బు సేఫ్‌గా ఉండటంతో పాటు త్వరగా రెట్టింపు కావాలని కోరుకుంటుంటారు. అలాంటి వారు వివిధ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా అలానే ఆలోచిస్తుంటే.. లాంగ్ టర్మ్‌లో అధిక వడ్డీ ఇచ్చే ఈ బ్యాంకుల్లో మీ మనీని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఉత్తమం.

బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలిక డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందిస్తాయి. దీని అర్థం ఎక్కువ కాలంతో పాటు వడ్డీ రేటు కూడా ఎక్కువ. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తెరవడానికి ముందుగా ఆయా బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను డిపాజిటర్లు పోల్చి చూడటం మంచిది. అలాగే, ఇప్పటికే ఖాతా ఉన్న బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవాలని కస్టమర్లను ప్రలోభపెడుతుంటారు. అలాంటి వాటితో జాగ్రత్తగా లేకుంటే మీరు లాభాలను కోల్పోవాల్సి రావచ్చు. టాప్ బ్యాంకులు అందించే తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేసుకోండి.

HDFC Bank Fixed Deposit

రుణాలిచ్చే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు HDFC Bank. 3 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్లపై 7 శాతం వడ్డీని HDFC Bank అందిస్తుంది. అదే కాల పరిమితితో సీనియర్ సిటిజన్లకు అయితే  7.5 శాతం వడ్డీని ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తారు. ఇంకా, కాల పరిమితి 4 సంవత్సరాల 7 నెలలు ఉంటే.. ఏడాదికి అత్యధిక వడ్డీ 7.4 శాతం పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు 2024 జూలై 24 నుంచి అమలులో ఉన్నాయి.

Latest Videos


ICIC Bank

ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిటర్లకు 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి)పై సంవత్సరానికి 7 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ పొందవచ్చు. 15 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేట్లు 2024 ఆగస్టు 10 నుంచి అమలులోకి వచ్చాయి.

State Bank of India (SBI)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 
ప్రభుత్వరంగ రుణ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు అదే కాల పరిమితి డిపాజిట్లపై 7.25 శాతం పొందేందుకు అర్హులు. 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాల పరిమితి ఉంటే.. సంవత్సరానికి 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

bank of baroda

బ్యాంక్ ఆఫ్ బరోడా 

బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిటర్లకు మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఇక్కడ డిపాజిట్ చేసుకోవడం మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ రేట్లు 2024 జూలై 15 నుంచి అమలులోకి వస్తాయి.

kotak mahindra bank

కోటక్ మహీంద్రా బ్యాంక్ 

కోటక్ మహీంద్రా బ్యాంక్ 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. అంటే FDపై 7.6 శాతం  వడ్డీ ఆఫర్ చేస్తున్నారు. 390, 391 రోజుల డిపాజిట్లపై అత్యధికంగా 7.4 శాతం వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2024 జూన్ 14వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.

click me!