వడ్డీ లేదు.. ష్యూరిటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం పొందండిలా..

First Published | Aug 14, 2024, 10:08 AM IST

మీరు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారా.. మీ కోసమే కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల వరకు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.. రండి..
 

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన(PMMY) స్కీమ్‌ చిరు వ్యాపారులకు, కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి ఎంతో ఆసరానిస్తోంది. 2015 ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులు, యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వారికి అవసరమైన మేర లోన్లు అందిస్తూ వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తోంది ఈ పథకం. ఇప్పటి వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ఇటీవల విడుదల కేంద్ర బడ్జెట్‌లో రూ.20 లక్షల వరకు రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

నిరుద్యోగులకు ఆసరా..

నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు ఈ ముద్ర రుణాలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే చిరు వ్యాపారవేత్తలు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. 
 


మూడు రకాలు రుణాలు పొందొచ్చు..

PMMY పథకం కింద మూడు రకాల లోన్లు అందజేస్తారు.  అవి శిశులోన్‌, కిషోర్ లోన్‌, తరుణ్‌ లోన్‌. వీటిలో శిశు లోన్‌ ద్వారా రూ.50,000 వరకు లోన్‌ పొందవచ్చు. కిషోర్ లోన్‌ ద్వారా రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రూ.20 లక్షల లోన్‌ వరకు తీసుకొనే అవకాశం ఉన్న విభాగం తరుణ్‌ లోన్‌ స్కీమ్‌. ఈ రుణం పొందడానికి mudra.org.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అవసరమైన కేటగిరీ ఎంచుకొని అప్లికేషన్‌ ఫామ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాన్ని పూర్తి చేసి ఆధార్‌ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్‌, బిజినెస్‌ అడ్రస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌, సెల్ఫ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తదితర డాక్యుమెంట్స్‌ జిరాక్స్‌ కాపీలను జత చేసి ముద్ర రుణాలు ఇస్తున్న బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవాలి. 

రూ.20 లక్షలు పొందాలంటే అర్హతలివి..

తరుణ్‌ లోన్‌ పథకం కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్‌ ఇచ్చే వారు. ఇప్పడు ఆ లిమిట్‌ను రూ.20  లక్షలకు పెంచారు. ప్రభుత్వం కోరిన అన్ని అర్హతలు ఉన్న వారు ఈ మొత్తం రుణం పొందవచ్చు. దరఖాస్తుదారుడు తన వ్యాపార ప్రణాళికతో పాటు బ్యాంకు అడిగిన అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి. అప్లికెంట్‌కు తప్పని సరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. 

ష్యూరిటీ అవసరం లేదు..

ముద్ర రుణాలు పొందడానికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు.  ఆస్తులు బ్యాంకులో తనఖా పెట్టనక్కరలేదు. ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవు. మంజూరైన లోన్‌కు వడ్డీ కూడా చెల్లించాల్సిన పని లేదు. 12 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు లోన్‌ తిరిగి చెల్లించవచ్చు. ఒకవేళ రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించలేకపోతే, మరో ఐదేళ్లపాటు పొడిగించుకోవచ్చు.

Latest Videos

click me!