రోజురోజుకు స్వదేశాన్ని వీడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది... ఈ క్రమంలోనే భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నవారు ఎక్కువగా వుంటున్నారు. తాజాగా భారత విదేశీ వ్యవహారాల శాఖ విదశాల్లో స్థిరపడిపోయి భారత పౌరసత్వాన్ని వీడినవారి లెక్కలు ప్రకటించింది. గతేడాది అంటే 2023 లో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులకున్నారట. ఈ గణాంకాలు ఆందోళన కలిగించేలా వున్నాయి.
గత రెండేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులకుంటున్నవారి సంఖ్య గణనీయంగా వుంది. 2023 కంటే ఎక్కువగా 2022లో ఏకంగా 2,25,620 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2021లో 1,63,370, 2020లో 85,256, 2019 లో 1,44,017 మంది పౌరసత్వాన్ని వీడారు. మొత్తంగా చూసుకుంటూ 2011 నుండి ఇప్పటివరకు 16 లక్షలమందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.