Business Ideas: లాభాలు తప్ప నష్టాలు లేని బిజినెస్‌లు.. సీజన్ ఏదైనా ఎవర్‌గ్రీన్.. అదేంటంటే.?

Published : Mar 15, 2026, 05:12 PM IST

Business Ideas: భారతదేశంలో ఎప్పటికీ నష్టం లేని, అత్యధిక లాభాలను ఇచ్చే నాలుగు ప్రధాన వ్యాపారాలు చూసేద్దాం. ఇవి మానవ ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి కాబట్టి వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి. 

PREV
15
నష్టం వస్తుందేమో అని భయం

వ్యాపారం అనగానే చాలా మంది నష్టం వస్తుందేమో అని భయపడుతుంటారు. అయితే, కొన్ని రంగాలు కాలంతో సంబంధం లేకుండా, ఎల్లప్పుడూ లాభాలను గడిస్తూనే ఉంటాయి. అటువంటి నాలుగు "ఎవర్ గ్రీన్" వ్యాపార రంగాలను ఇప్పుడు చూసేద్దాం.

25
ఫుడ్ బిజినెస్ (Food Business):

మనిషి ప్రాణం ఉన్నంత కాలం ఆహారం అవసరం. రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే ఏ హోటల్ లేదా కేఫ్ అయినా సరే కచ్చితంగా సక్సెస్ అవుతుంది. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఇందులో లాభాలు 5 రెట్లు అధికంగా ఉంటాయి.

35
ఫార్మా & హెల్త్ కేర్ (Pharma & Health care):

ఆరోగ్యం విషయంలో ఎవరూ రాజీ పడరు. చిన్నపాటి క్లినిక్ నుంచి పెద్ద హాస్పిటల్స్ వరకు, అలాగే మందుల దుకాణాలకు నిత్యం రద్దీ ఉంటుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రంగం మరింత వృద్ధి చెందుతోంది.

45
రియల్ ఎస్టేట్ & కన్స్ట్రక్షన్(Real Estate & Construction):

మనిషికి గూడు అనేది ప్రాథమిక హక్కు. జనాభా పెరిగే కొద్దీ ఇళ్లకు, వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరుగుతుంది. స్థలం విలువ ఎప్పుడూ తగ్గే అవకాశం ఉండదు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడూ లాభదాయకమే.

55
ఎడ్యుకేషన్ (Education):

భారతదేశంలో తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్మైనా పిల్లలను చదివించాలని కోరుకుంటారు. స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు లేదా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రంగంలో మాంద్యం ప్రభావం తక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories