దేశంలో టాప్ 3 రిచ్చెస్ట్ రైల్వే స్టేషన్లు ఇవే : ఎన్నివేల కోట్ల ఆదాయమో తెలుసా?

First Published Sep 20, 2024, 10:30 PM IST

పేద, మద్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం రైల్వే. కానీ భారతీయ రైల్వే చాలా రిచ్. దేశంలో వేల కోట్లు సంపాదించే రైల్వే స్టేషన్లు కూడా వున్నాయి. అలాంటి స్టేషన్లేవో తెలుసుకుందాం. 

Indian Railway

Indian Railway : భారతీయ ప్రజా రవాణా వ్యవస్థకు మూలస్తంభం రైల్వేస్. ప్రతిరోజూ లక్షలాదిమందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు సరుకు రవాణాలోనూ కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ రైల్వే. ఇలా దేశ అభివృద్దికే కాదు ఆర్థిక వృద్దికి తనవంతు సాయం చేస్తోంది భారత రైల్వే.
 

Indian Railway

మిగతా రవాణా వ్యవస్థలతో పోలిస్తే రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.  అంతేకాదు రైలు ప్రయాణం సౌకర్యవంతమే కాదు సురక్షితమైనది కూడా. అందువల్లే భారతీయులు రైలులో ప్రయాణించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలా దేశ ప్రజలు శతాబ్దాలుగా రైల్వేను ఆదరిస్తూ వస్తున్నారు. దీంతో రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారింది. 

అయితే పేద, మద్యతరగతి ప్రజలకు చేరువైన మన రైల్వేస్ ఆదాయం విషయంలో బాగా సౌండే. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 లో కేంద్రం రైల్వేస్ కి  ఏకంగా రూ.2,62,200 కోట్లను కేటాయించిందంటేనే అర్థం చేసుకోవచ్చు సంపాదన ఏ స్థాయిలో వుంటుందోనని. ఇలా ప్రజా రవాణాలోనే కాదు ఆదాయంలోనే టాప్ లో నిలుస్తోంది మన ఇండియన్ రైల్వేస్. 

దేశంలోని చాలా రైల్వే స్టేషన్లు ప్రతి ఏటా వేలకోట్లు ఆర్జిస్తున్నాయి. ఇలా దేశంలో అత్యధిక ఆదాయాన్ని కలిగివున్న టాప్ రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందా. ఆ స్టేషన్ల ఆదాయం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 

Latest Videos


New Delhi Railway Station

అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 3 రైల్వే స్టేషన్లు : 

1. న్యూడిల్లీ రైల్వేస్టేషన్ :

భారతదేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో న్యూడిల్లి ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కీలక నగరాల నుండి ఇక్కడికి రైలు సర్వీసులు వున్నాయి. దీంతో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు, వందలాది రైళ్ల రాకపోకలతో బిజీబిజీగా వుంటుంది. ఇక్కడి నుండి ప్రతిరోజు 250 కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.   

ఇక రైలు టికెట్ల ద్వారానే కాకుండా స్టేషన్ లో జరిగే వ్యాపారాలు, ఇతర మార్గాల ద్వారా రైల్వే స్టేషన్లకు ఆదాయం వస్తుంది. ఇలా దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న స్టేషన్లలో న్యూడిల్లీ రైల్వే స్టేషన్ టాప్ లో వుంది. ఈ ఒక్క స్టేషన్ ద్వారానే ఏడాదికి రూ.3337 కోట్ల ఆదాయం వస్తుంది. 
 

Howrah Railway Station

2. హౌరా రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్) 

భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో హౌరా స్టేషన్ ఒకటి. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వుంది. స్వాతంత్య్రానికి దాదాపు 90 ఏళ్ల ముందే అంటే 1854 లోనే ఈ రైల్వే స్టేషన్ నుండి రైలు సర్వీసులు నడిచాయి. ప్రస్తుతం ఈ స్టేషన్ నుండి దేశంలోని అనేక ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి. నిత్యం  లక్షలాదిమంది ప్రయాణికులకు ఈ స్టేషన్ సేవలు అందిస్తోంది. 

ఆదాయం పరంగా చూసుకుంటే హౌరా స్టేషన్ దేశంలోనే రెండో అత్యధిక ఆదాయం కలిగిన స్టేషన్. ప్రతి ఏటా ఈ స్టేషన్ నుండి రూ.1692 కోట్ల ఆదాయం వస్తుంది. 
 

Chennai Raiway Station

3. చెన్నై రైల్వే స్టేషన్ : 

భారతదేశంలోని రైల్వే జోన్లలో సదరన్ రైల్వే జోన్ ఒకటి...దీని ప్రదాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నైలో వుంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటి.ఈ స్టేషన్ నుండి ప్రతిరోజు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి...వేలాదిమంది ప్రయాణిస్తుంటారు.  

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే స్టేషన్లలో చెన్నై సెంట్రల్ స్టేషన్ మూడో స్థానంలో వుంది. ఈ స్టేషన్ నుండి ఏడాదికి రూ.1,299 కోట్ల ఆదాయం వస్తుంది. 
 

click me!