ఆకాశానికి ఇంధన ధరలు.. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఎంత పెరిగిందంటే ?

First Published Jul 5, 2021, 11:40 AM IST

నేడు  5 జూలై 2021న ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించాయి. డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేనప్పటికి పెట్రోల్ ధర 32 నుండి 35 పైసలు పెంచారు. నేడు ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .99.86 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .89.36గా ఉంది. 

ముంబైలో పెట్రోల్ ధర రూ .105.92, డీజిల్ ధర లీటరుకు రూ .96.91.తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.84; డీజిల్‌ రూ.97.46 పైసలకు చేరుకుంది.ప్రధాన మెట్రో నగరాలలో నగరం డీజిల్ పెట్రోల్ఢీల్లీ 89.36 99.86ముంబై 96.91 105.92కోల్‌కతా 92.27 99.84చెన్నై 93.91 100.75
undefined
పెట్రోల్ ధర రూ .100 దాటిందిరాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు పెట్రోల్ ధర రూ .100 దాటింది.
undefined
ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 36 సార్లు పెట్రోలు ధరను సవరించారు. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ. 9.49 ధరను పెంచారు. అయితే నేడు డీజిల్‌ ధరలు పెంచకుండా స్వల్ప ఉపశమనం కలిగించాయి చమురు కంపెనీలు.
undefined
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకరోజు విరామం తరువాత మరొకరోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు విరామం ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది.
undefined
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది,
undefined
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షితారు. ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు వర్తిస్తాయి. పెట్రోల్, జిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.ఈ పరిమితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.
undefined
click me!