ఆర్‌బీఐ నిబంధనల్లో మార్పులు.. గడువు తీరినా డిపాజిట్‌ తీసుకోకపోతే తక్కువ రేటు..

First Published Jul 3, 2021, 2:09 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ శుక్రవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 
 

ప్రస్తుతం టర్మ్‌ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్‌ వెనక్కి తీసుకోకపోతే తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు అమలవుతోంది అయితే ఇక మీదట అలా ఉండదు.‘‘టర్మ్‌ డిపాజిట్‌ గడువు తీరిన క్లెయిమ్‌ చేసుకోకుండా బ్యాంకులోనే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్‌ ఖాతా రేటు లేదా టర్మ్‌ డిపాజిట్‌ ఒప్పంద రేటు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయి.
undefined
టర్మ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంక్ అందుకున్న వడ్డీ డిపాజిట్‌ను సూచిస్తుంది. ఇందులో రీకరింగ్, కుములేటివ్, యాన్యుటీ, రీఇన్వెస్ట్‌మెంట్ డిపాజిట్లు, నగదు ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి.
undefined
click me!