ఆధార్‌ కార్డులో పేరు లేదా ఏదైనా మార్పులు చేయాలా..? అయితే ఇలా ఫ్రీగా అపాయింట్‌మెంట్ తీసుకోండి..

First Published Jul 3, 2021, 5:33 PM IST

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదు గుర్తింపు కార్డు కూడా. ఏదైనా ఆర్థిక లావాదేవీలకు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యం. ఆధార్ లో మీ చిరునామా సమాచారాన్ని మాత్రమే కాకుండా,  బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది.  

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ తరపున అనేక ప్రాంతీయ భాషలలో ఆధార్‌ను ఉత్పత్తి చేసే సదుపాయాన్ని అందిస్తుంది. ఇంగ్లీషుతో పాటు ఉర్దూ, పంజాబీ, తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలలో తయారు చేసిన ఆధార్ కార్డును పొందవచ్చు.
undefined
కొత్త ఆధార్ కార్డు పొందాలా లేదా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఇ-మెయిల్ ఐడి, లింగం లేదా బయోమెట్రిక్‌ను ఆధార్‌లో అప్ డేట్ చెయ్యాలా.... ఇందుకు మీరు గంటలు తరబడి లైన్ లో నిలబడవలసిన అవసరం లేదు. ఆధార్ జారీ చేసే సంస్థ యుఐడిఎఐ ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. అంటే మీరు ఇంట్లోనే ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి అపాయింట్‌మెంట్ పొందవచ్చు.
undefined
అపాయింట్‌మెంట్ ఎలా తీసుకోవాలంటే ?ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి, మీరు మొదట యుఐడిఎఐ వెబ్‌సైట్ https:uidai.gov.in ని సందర్శించాలి .
undefined
వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశాక మీరు 'మై ఆధార్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మీకు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
undefined
1.తరువాత మీకు లొకేషన్ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ మీ నగరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి2.నగరాన్ని ఎంచుకున్న తరువాత, 'ప్రొసీడ్ టు బుక్ అపైంట్మెంట్ ' పై క్లిక్ చేయండి.3.ఇప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్త ఆధార్, ఆధార్ అప్ డేట్, మ్యానేజ్ అపైంట్మెంట్ అనే మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. వీటిలో మీకు కావల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.4.ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్, ఓ‌టి‌పిని ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మీ అప్లికేషన్ వేరిఫై అవుతుంది. ఇప్పుడు మీరు అపాయింట్‌మెంట్ కోసం టైమ్ స్లాట్‌ను ఎంచుకోవాలి. ఇవన్నీ చేసిన తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి.నోట్ : ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తిగా ఉచితం అని గమనించండి.
undefined
click me!