గుడ్ న్యూస్ దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. 4 నెలల కనిష్ట స్థాయికి చేరిన పసిడి..

First Published Aug 9, 2021, 11:51 AM IST

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్  ఫ్యూచర్స్ పతనం కొనసాగుతోంది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.3 శాతం (రూ .600) తగ్గి 10 గ్రాములకు రూ. 46,029 కి పడిపోయింది. అంటే నాలుగు నెలల కనిష్ట స్థాయికి బంగారం చేరింది. 

 వెండి గురించి మాట్లాడితే  1.6 శాతం అంటే కిలో రూ.1000 తగ్గి రూ. 63,983 కి చేరుకుంది. గత ఏడాది బంగారం ధర గరిష్ట స్థాయి (10 గ్రాములకు రూ. 56,200) నుండి రూ. 10,171 తగ్గింది.  స్పాట్ బంగారం ఔన్స్ కి 2.3 శాతం తగ్గి 1,722.06 డాలర్లకు చేరుకుంది. వెండి 2.6 శాతం తగ్గి 23.70 డాలర్లకు చేరింది.
 

ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్-ఆధారిత ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్, ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్  హోల్డింగ్స్ గురువారం 1,027.61 టన్నులకు గాను 1,025.28 టన్నులకు పెరిగింది. గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. బంగారంపై బలహీన పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి. ఒక బలమైన డాలర్ ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తుంది.
 

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్ అని తెలిసిందే. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి బంగారం ప్రధానంగా దిగుమతి చేయబడుతుంది. వాల్యూమ్ పరంగా భారత్ ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. 
 

దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర రూ. 45,690 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 46,690 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,170 ఉంది.

  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430గా ఉంది.

  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,690గా ఉంది.
 

 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 ఉంది.

  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.

 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.
 

click me!