జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ప్రముఖ దేశీయ కంపెనీలు.. అడగగొట్టిన దివిస్ ల్యాబ్, జే‌కే టైర్..

First Published Aug 7, 2021, 5:33 PM IST

రిలయన్స్ క్యాపిటల్, ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కాపర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫార్మాస్యూటికల్ కంపెనీ దివిస్ లాబొరేటరీస్, జెకె టైర్ & ఇండస్ట్రీస్ జూన్ 30 2021తో ముగిసిన త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించాయి.  
 

రిలయన్స్ క్యాపిటల్

30 జూన్ 2021తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏ‌డి‌ఏ‌జి గ్రూప్  ఆర్ధిక విభాగం రిలయన్స్ క్యాపిటల్  రూ .1,006 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,095 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.  అంటే గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ నష్టం కొద్దిగా తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,287 కోట్లుగా ఉన్న దాని ఆదాయం ఇప్పుడు రూ .4,448 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖర్చులు రూ .5,261 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖర్చులు రూ .5,249 కోట్లుగా ఉంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ మొదటి త్రైమాసికంలో బ్యాంక్ లాభం రూ .1208 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ .864 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే నష్టల నుండి లాభాలకు వచ్చింది. బ్యాంక్ వడ్డీ ఆదాయాలు 15.7 శాతం పెరిగి రూ. 7892 కోట్లకు చేరుకున్నాయి, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయాలు రూ .6816 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌పి‌ఏల పరంగా బ్యాంక్ నాన్-పర్ఫర్మింగ్ అసెట్స్ 3.03 శాతంగా, గ్రాస్ నాన్-పర్ఫర్మింగ్ అసెట్స్ 8.86 శాతంగా ఉన్నాయి. 
 

జూన్ త్రైమాసికంలో హిందుస్థాన్ కాపర్

హిందుస్థాన్ కాపర్ కన్సాలిడేటెడ్ నికర లాభం 53.6 శాతం పెరిగి రూ .45.63 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ .29.69 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ .278.73 కోట్లకు తగ్గింది.

దివిస్ ల్యాబ్

హిందుస్థాన్ కాపర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రిలయన్స్ క్యాపిటల్ కాకుండా దివీస్ ల్యాబ్ జూన్ త్రైమాసిక ఫలితాలను కూడా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం పెరిగి రూ. 557 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ .492 కోట్లుగా ఉంది. ఈ కాలంలో దాని మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ .1,748 కోట్ల నుండి రూ .1,997 కోట్లకు పెరిగింది. 

జెకె టైర్

టైర్ తయారీదారు జెకె టైర్ & ఇండస్ట్రీస్ మొదటి త్రైమాసికంలో నష్టాల నుండి లాభాలను ఆర్జించింది. ఈ కాలంలో కంపెనీ రూ. 44 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 204 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా రూ .2,608 కోట్లకు పెరిగింది. గతంలో ఇది రూ .1,131 కోట్లు. స్టాండలోన్ ప్రాతిపదికన మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ .45 కోట్లుగా ఉంది. 

click me!