నిన్న ఎస్‌బి‌ఐ నేడు హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్: ఈ రోజు సాయంత్రం 6 నుంచి ఆ సర్వీసులు నిలిపివేత..

First Published Aug 7, 2021, 2:41 PM IST

 దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్  కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి రేపు రాత్రి 10 గంటల వరకు కొన్ని ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. 

అంతేకాకుండా ఆగస్టు 11న కూడా కస్టమర్లకు కొన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండవు అని సూచించింది. ఈ సమయంలో  జరిపే ఏదైనా ఆన్ లైన్ లావాదేవీలు స్తభించిపోవచ్చని  తెలిపింది. షెడ్యూల్  నిర్వహణ కారణంగా బ్యాంక్  కొన్ని సేవలు ఆగిపోనున్నాయి.  
 

ఈ సర్వీసులు 28 గంటల పాటు అందుబాటులో ఉండదు

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్  వినియోగదారులకు ఆగస్టు 7 సాయంత్రం 6 గంటల నుండి ఆగష్టు 8 రాత్రి 10 గంటల వరకు అంటే 28 గంటల పాటు బ్యాంక్ కస్టమర్‌లు  నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా చూడలేరు. అందువల్ల మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఖాతా ఉంటే  ఏదైనా లావాదేవికి సంబంధించిన పని చేయాల్సి వస్తే సాయంత్రం 6 గంటల లోపు చేసుకోవాల్సిందిగా సూచించింది.

డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు

హెచ్‌డి‌ఎఫ్‌సి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు  సంబంధించిన సేవలు ఆగస్టు 11న ప్రభావితం కానున్నాయి, ఆగస్టు 11న షెడ్యూల్  నిర్వహణ కారణంగా నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్‌లోని డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ సంబంధిత సేవలు మధ్యాహ్నం 12:30 నుండి  మరుసటి రోజు ఉదయం 6:30 వరకు నిలిచిపోనున్నాయి. 

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులు ఇలాంటి అంతరాయలను ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులు గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. 

కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం

డిసెంబర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్   కొత్త క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది. హెచ్‌డిఎఫ్‌సి డేటా సెంటర్ పనితీరు దెబ్బతినడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్డర్ జారీ చేసింది. గత రెండేళ్లలో ఐటి వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నామని  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గతంలో తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ ఛానెళ్లలో ఇటీవల నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

click me!