మనదేశంలో విజయవంతమైన వ్యక్తి అంటే మొదట వినిపించే పేరు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని తనదైన శైలిలో విస్తరించి విజయవంతమయ్యారు. ఆ విజయం కనుక ఎన్నో సక్సెస్ సూత్రాలు ఉన్నాయి.
మనదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా ముకేశ్ అంబానీ కుటుంబం ముందు వరుసలో నిలుస్తుంది. వారసత్వపు వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ తనదైన పద్ధతిలో మరింత ముందుకు తీసుకువెళ్లారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుపొందారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అతనికి ఆస్తులు కూడా ఉన్నాయి. వేలకోట్ల ఆస్తులు ఉన్న ముఖేష్ అంబానీ విజయాన్ని అంత సులువుగా అందుకోలేదు. అందుకోసం అతను ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా వినయంతోనే ప్రతి పనిని పూర్తి చేశారు.
25
గర్వానికి దూరం
డబ్బులు అధికంగా ఉన్న చోట గర్వం ఉంటుందని చెబుతారు. కానీ ముఖేష్ అంబానీకి గర్వం అనే పదానికి అర్థమే తెలియదు. ఆయన ఎంతో వినయవంతుడిగా, మంచి ఫ్యామిలీ మెన్ గా ఉన్నారు. తనకంటూ కొన్ని నమ్మకాలు పద్ధతులు ఉన్నాయి. తన దినచర్యను ప్రతిరోజూ ఒకేలా పాటిస్తారు. అతను విలాసాలకు అలవాటు కాలేదు. మొదటి నుంచి తనపై తనకు నమ్మకం అధికంగా ఉండేది. తాను ఏదో ఒకటి సాధిస్తానని నమ్మేవాడు
35
లక్ష్యం పెట్టుకోవాలి
లక్ష్యం ముందుగా పెట్టుకున్న తర్వాతే లక్ష్యసాధనకు మార్గం వెతకాలి. కాబట్టి ముకేశ్ అంబానీ ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ తర్వాత ఆ కార్య సాధన కోసం కష్టపడేవారు. ఆయన ఒంటరిగా విజయం సాధించడం అంత సులువు కాదని నమ్మేవారు. అందుకే టీం వర్క్ ను ప్రోత్సహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయం సాధించడానికి టీం వర్క్ ప్రధానమైనదని ఆయన తన ప్రసంగాలలో చెబుతూనే ఉంటారు. ఉద్యోగులను నమ్మితే వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇస్తే కచ్చితంగా వారు అద్భుతాలు చేసి చూపిస్తారని అతను చెబుతూ ఉంటారు.
ఏ పనిలోనైనా విజయం పొందాలంటే ముందు పాజిటివ్ ఆలోచనలను తెచ్చుకోవాలన్నది ముకేశ్ అంబానీ నమ్మకం. ఆయన ప్రతి పని గురించి సానుకూలంగానే ఆలోచిస్తారు. అదే అతడిని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిందని చెబుతారు. ఎంతటి నష్టం వచ్చినా ,కష్టం ఎదురైనా పాజిటివిటీ మాత్రం వదులుకోరు. మీరు చెడులో కూడా సానుకూలతను చూస్తే ఆ కష్టం సులువుగా దాటి ముందుకు వెళ్ళచ్చు.
55
సమస్యకు మూలాన్ని కనిపెట్టి
సమస్యలను చూస్తూ ముఖేష్ అంబానీ ఎప్పుడూ కలవరపడలేదు. సమస్య తెలియగానే దానికి మూలాన్ని తెలుసుకొని ఆ తర్వాతే పరిష్కారం గురించి వెతికేవారు. సమస్య మూలం తెలియనప్పుడు పరిష్కారం కష్టం అనేది ముఖేష్ అంబానీ అభిప్రాయం. ముకేశ్ అంబానీ తానే కాదు తన పిల్లలకు కూడా ఇదే అలవాటును చేశారు. వారు కూడా విజయపథంలోనే దూసుకెళ్తున్నారు.