Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు ఎక్కువగా సిబిల్ స్కోర్ (CIBIL Score) మీదే దృష్టి పెడతారు. కానీ లోన్ ఆమోదం పొందాలంటే కేవలం స్కోర్ మాత్రమే కాదు, ఇతర ఆర్థిక అంశాలు కూడా చాలా కీలకం. ఇంతకీ ఆ అంశాలు ఏంటంటే.?
బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మీరు ప్రతి నెల ఎంత సంపాదిస్తున్నారో పరిశీలిస్తాయి. మీకు స్థిరమైన జీతం (Fixed Monthly Income) ఉంటే బ్యాంక్‌కి నమ్మకం కలుగుతుంది. మీరు సమయానికి EMIలు చెల్లించగలరని బ్యాంకులు భావిస్తాయి. కానీ మీ ఆదాయం స్థిరంగా లేకపోతే లేదా ప్రతి నెల మారుతూ ఉంటే, బ్యాంక్ మీకు లోన్ ఇవ్వడానికి సంకోచిస్తుంది. వ్యాపారులైతే తమ ఆదాయం నిరూపించే డాక్యుమెంట్లు ఇవ్వాలి. మీరు పెద్ద కంపెనీలో ఉద్యోగి అయితే, లోన్ ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
25
వయస్సు కూడా ప్రభావం చూపుతుంది
బ్యాంకులు లోన్ ఆమోదించే సమయంలో అప్లికెంట్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటాయి. యువకులు అయితే, వారి వద్ద ఆదాయం సంపాదించే సమయం ఎక్కువగా ఉందని భావిస్తారు. అందువల్ల వారికి లోన్ సులభంగా ఇస్తాయి. కానీ వయస్సు ఎక్కువగా ఉన్నవారికి, లేదా వృద్ధులకు, బ్యాంకులు లోన్ ఇవ్వడంలో జాగ్రత్తగా ఉంటాయి. వయస్సు పెరిగేకొద్దీ ఆదాయం తగ్గే అవకాశం ఉండడమే దీనికి కారణం.
35
క్రెడిట్ హిస్టరీ (CIBIL Score) ఒక్కటే కాదు
సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా, మీరు ఇతర ఆర్థిక ప్రమాణాలకు సరిపోకపోతే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉంటే మంచిదే, కానీ అది ఒక్కటే నిర్ణయం కాదు. బ్యాంక్‌కి మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారా, అప్పులు ఎంతవరకు తీర్చుతున్నారు అనే వివరాలు కూడా ముఖ్యం. కాబట్టి గతంలో తీసుకున్న అప్పులు, వాటిని మీరు చెల్లించిన తీరును కూడా పరిగణలోకి తీసుకుంటాయి కొన్ని బ్యాంకులు.
మీరు ఇప్పటికే మరిన్ని లోన్లు తీసుకొని వాటి EMIలు చెల్లిస్తున్నట్లయితే, బ్యాంక్‌కి అనుమానం వస్తుంది. మీ ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే వెళ్తే, కొత్త లోన్ మంజూరు చేయడంలో బ్యాంక్ వెనకడుగు వేస్తుంది. అందువల్ల కొత్త లోన్ తీసుకోవాలంటే ముందుగా పాత అప్పులను తగ్గించడం లేదా క్లియర్ చేయడం మంచిది.