Stocks: సరిగ్గా జూన్ 30, 2021 న లక్ష రూపాయలు ఈస్టాక్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే...ఈ రోజు 45 లక్షలు మీ సొంతం..

First Published Jun 30, 2022, 1:16 PM IST

స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా నిలిచి ఇన్వెస్టర్ల జేబులను నింపేస్తుంటాయి. అలాంటి స్టాక్స్ అరుదుగా మనకు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ స్టాక్స్ ను ఇండెక్స్ లో గుర్తించడం కత్తి మీద సామే అని చెప్పాలి. అలాంటి స్టాక్స్ లో ఒక దాని గురించి తెలుసుకుందాం. 

వేలాది స్టాక్స్ లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ గుర్తించడం చాలా కష్టం. కానీ కొన్ని స్టాక్స్ ఫండమెంటల్స్ ను అంచనా వేసి అవి భవిష్యత్తులో ఎంత రిటర్న్ ఇస్తాయో క్వాలిఫైడ్ నిపుణులు అంచనా వేస్తుంటారు. అయితే తాజాగా మార్కెట్ భారీగా పతనం అవుతున్నప్పటికీ, కొన్ని స్టాక్స్ మాత్రం భారీగా రిటర్న్ ఇస్తున్నాయి.

ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు సంబంధించిన ఒక కంపెనీ గడిచిన ఏడాది కాలంలో అద్భుతమైన రాబడిని అందించాయి. ఆ కంపెనీ పేరు రజనీష్ వెల్నెస్ (Rajnish Wellness Ltd) గత 1 సంవత్సరంలో కంపెనీ షేర్లు రూ. 5 నుంచి రూ.200 వరకూ పెరిగాయి. రజనీష్ వెల్‌నెస్ షేర్లు ఈ కాలంలో పెట్టుబడిదారులకు ఏకంగా  3,500 శాతానికి పైగా రాబడిని అందించాయి. రజనీష్ వెల్ నెస్ షేర్లలో 52 వారాల గరిష్టం రూ.240.85 గాన నమోదైంది. అదే సమయంలో కంపెనీ షేర్లలో 52 వారాల కనిష్ట స్థాయి రూ.6.04గా ఉంది.

(Source: Google Finance)

1 లక్ష రూపాయలు ఒక సంవత్సరంలో 45 లక్షల రూపాయలు అయ్యాయి..
30 జూన్ 2021న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రజనీష్ వెల్‌నెస్ షేర్లు రూ. 8 స్థాయిలో ఉన్నాయి. జూన్ 30, 2022న BSEలో కంపెనీ షేర్లు రూ. 222.60 స్థాయిలో ట్రేడవుతున్నాయి. కంపెనీ షేర్లు గత ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 3,500 శాతానికి పైగా రాబడిని అందించింది. అంటే  ఒక వ్యక్తి జూన్ 30, 2021న కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, తన పెట్టుబడిని అలాగే ఉంచుకుని ఉంటే, ప్రస్తుతం ఈ డబ్బు రూ. 45.33 లక్షలుగా ఉండేది.

గత 6 నెలల్లో 950% కంటే ఎక్కువ రాబడి...

రజనీష్ వెల్‌నెస్ షేర్లు గత 6 నెలల్లో 950% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. 3 జనవరి 2022న కంపెనీ షేర్లు రూ. 20.45 స్థాయిలో ఉన్నాయి. జూన్ 30, 2022న BSEలో కంపెనీ షేర్లు రూ. 222.60 స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఒక వ్యక్తి 6 నెలల క్రితం కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ప్రస్తుతం ఈ డబ్బు రూ.10.88 లక్షలుగా ఉండేది.

రజనీష్ వెల్‌నెస్ షేర్లు గత నెలలో పెట్టుబడిదారులకు దాదాపు 19 శాతం రాబడిని అందించాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.234 కోట్లుగా నమోదైంది. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పెట్టుబడి సలహా కాదు. ఏషియానెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మార్కెట్‌ లో పెట్టుబడులు రిస్క్ తో కూడినవి, కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోండి.)
 

click me!