Lucky Fish: ఒక్క చేప జీవితాన్నే మార్చేసింది, పశ్చిమ బెంగాల్ లో అద్భుతం, 13 లక్షలు పలికిన చేప..

First Published Jun 27, 2022, 10:23 PM IST

పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ చేప ఓ మత్స్యకారుడి జీవితాన్నే మార్చేసింది. వలలోపడిన చేప ఏకంగా 13 లక్షల ధర పలికింది. దీంతో అతడికి లైఫ్ టైం సెటిల్ మెంట్ అయిపోయింది. 

వివరాల్లోకి వెళితే, తెలియా భోలా అనే ఓ పెద్ద చేప ఆదివారం ఈస్ట్ మిడ్నాపూర్‌లో నివాసంలో ఉండే షిబాజీ కబీర్ అనే మత్స్యకారుడి వలలో పడింది. సాధారణంగా అతడు ఎంత ధర వస్తుందో అంచనా వేసుకోలేదు.  డిఘాలో జరిగిన చేపల వేలంలో 55 కిలోల బరువున్న ఈ చేప ఏకంగా రూ.13 లక్షలకు అమ్ముడుపోయింది. దీన్ని ఓ విదేశీ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విలువైన చేప నుండి ప్రాణాలను రక్షించే మందులను తయారు చేస్తారు. దీని ధర చాలా ఖరీదైనది. సాధారణంగా ఈ జాతి చేపలు లోతైన సముద్రంలో మాత్రమే కనిపిస్తాయి. అరుదుగా తీరాల దగ్గరకు వస్తుంటాయి.

ఆదివారం పట్టుబడిన ఈ చేప ఆడది, గర్భవతి. దీని గుడ్ల బరువు ఐదు కిలోలు. దిఘాలో ఈ చేపను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. దీని వేలం మూడు గంటల పాటు కొనసాగింది. ఇది హైబ్రిడ్ రకం చేప. అంటే స్త్రీ, పురుష గుణాలు రెండూ ఉండేవి. ఈ ఏడాది జనవరిలో మత్స్యకారుల వలలో 121 ఈ జాతి చేపలు చిక్కుకున్నాయి. కానీ వాటి బరువు సుమారుగా 20 నుంచి 18 కిలోల బరువు మాత్రమే ఉన్నారు.

ఇవి ఎందుకు చాలా ఖరీదైనవి
వాస్తవానికి, తెలియా భోలా చేపలు చాలా ఖరీదైనవి కావడానికి అతిపెద్ద కారణం దాని కడుపు. ఇందులో చాలా ప్రయోజనకరమైన అంశాలు కనిపిస్తాయి. ఈ చేప యొక్క అతిపెద్ద కొనుగోలుదారులు ఫార్మాస్యూటికల్ కంపెనీలు. ఈ చేపల పొట్టలో ఉండే కొవ్వుతో అనేక ప్రాణాలను రక్షించే మందులు తయారు చేస్తారు. విదేశీ మార్కెట్లలో ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీని రంగు బంగారు రంగు.
 

ఈ జాతి చేపలు లోతైన సముద్రంలో కనిపిస్తాయి. కానీ సంతానోత్పత్తి కాలంలో, ఇది తీర ప్రాంతాలు, సమీపంలోని నదులు మొదలైన వాటిలో కూడా కనిపిస్తుంది. దీనికి ఆరు రోజుల ముందు తెలియా భోలా జాతికి చెందిన మగ  ఫిష్ ను రూ.9 లక్షలకు విక్రయించారు. ఈ చేప చాలా తక్కువగా వలల్లో చిక్కుకుపోతుందని దిఘా ఫిషర్‌మెన్ అండ్ ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యుడు నబ్‌కుమార్ పైరా చెప్పారు.

జనవరిలో ఏకంగా 121 చేపలు దొరికాయి

ఈ ఏడాది జనవరిలో కూడా 121 'తెలియ భోలా' చేపలు మత్స్యకారుల వలలో చిక్కుకున్నాయి. ఈ చేపల విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ఒక్కో చేప 18 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉంటుంది. 2021 సంవత్సరంలో కూడా, దీఘా తీరం నుండి మత్స్యకారులు 30 తెలియా భోలా ఫిష్‌లను పొందారు, వీటిని వేలం వేయగా మొత్తం కోటి రూపాయలకు విక్రయించారు.

click me!