Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..అయితే దాని వల్ల కలిగే లాభ, నష్టాలు ఇవే ?

Published : Jun 27, 2022, 04:52 PM IST

Pay rent through credit cards: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేసుకునే యువత తమ ఖర్చుల చెల్లింపు కోసం క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో చాలా కంపెనీలు క్రెడిట్ కార్డులతో ఇంటి అద్దెను చెల్లించే ఆఫర్లను కూడా తెచ్చాయి. కానీ క్రెడిట్ కార్డుల ద్వారా అద్దెను చెల్లించవచ్చా...? లేదా..? అనే విషయంపై చాలా మంది తర్జన భర్జన పడుతుంటారు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం వల్ల కలిగే లాభ, నష్టాల గురించి తెలుసుకుందాం..

PREV
15
Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లిస్తున్నారా..అయితే దాని వల్ల కలిగే లాభ, నష్టాలు ఇవే ?
Pay rent through credit cards

నేటి యువ తరం లేదా జీతాలు తీసుకునే వారు షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కరోనా కాలంలో, చాలా కంపెనీలు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించే సౌకర్యాలను అందించడం ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించాలా వద్దా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇది లాభదాయకమా లేదా నష్టం కలిగిస్తుందా ?  గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

25
Pay rent through credit cards

Cred, MyGet, NoBroker, Paytm, PhonePe, Magicbricks వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అద్దె చెల్లించడానికి అనుమతిస్తాయి. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా జరిగే చాలా లావాదేవీల మాదిరిగానే, కార్డ్ హోల్డర్ కూడా రివార్డ్‌లను పొందుతాడు. అయితే, వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి అద్దె చెల్లించడంపై కూడా వివిధ రకాల రుసుములు విధిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డ్‌లో  రివార్డ్ పాయింట్లు, డబ్బు సర్దుబాటు అవుతుందని చాలా మంది వినియోగదారులు అంటున్నారు. అదు విధంగా, ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
 

35
Pay rent through credit cards

అద్దె ఎలా చెల్లించాలి
క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం, మీరు ఓనర్ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) చిరునామాను జోడించి లావాదేవీని పూర్తి చేయాలి. చెల్లింపు రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే, మీరు మీ ఓనర్  పాన్ వివరాలను సమర్పించాలి. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఇంటి చిరునామాను జోడించమని మిమ్మల్ని అడగవచ్చు. నెలవారీ అద్దె నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు మిమ్మల్ని రెంటల్ అగ్రిమెంట్ కూడా అడగవచ్చు.

45
Pay rent through credit cards

ప్రయోజనం
ఈ అన్ని యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లతో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీరు ఒక క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ లేకుండా దాదాపు 45 నుండి 56 రోజుల ఉచిత క్రెడిట్ వ్యవధిని పొందుతారు. రెండవది, మీరు వాటి ద్వారా అనేక రకాల క్యాష్‌బ్యాక్, లాయల్టీ పాయింట్లు, ఎయిర్ మైళ్లను కూడా పొందుతారు. ఉదాహరణకు, మీరు మ్యాజిక్ బ్రిక్స్‌తో చెల్లిస్తే, మీరు వివిధ బ్యాంకుల ప్రకారం రూ. 200 నుండి రూ. 3000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

55
Pay rent through credit cards

నష్టం ఇదే...
క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపుపై వివిధ ప్లాట్‌ఫారమ్‌లు సర్వీసు ఫీజులను వసూలు చేస్తాయి. మరోవైపు, మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో ఆలస్యం అయితే, మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను డిఫాల్ట్ చేయడం లేదా చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని కూడా చెల్లించడం వల్ల ప్రిన్సిపల్ మొత్తంపై వార్షికంగా 30% కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్‌కు శాశ్వత నష్టం కలిగించే అవకాశం ఉన్నందున కస్టమర్లు తరచుగా క్రెడిట్ పరిమితిని మించకుండా జాగ్రత్త వహించాలి.
 

click me!

Recommended Stories