డబ్బు ఉంటే ఏదైనా కొనవచ్చు, కానీ తల్లి ప్రేమను అనేది ఓ సామెత, కానీ ఆతల్లి ప్రేమకు ప్రతి రూపం అయిన తల్లి పాలను సైతం మార్కెట్లో అమ్మేందుకు ఓ వ్యాపార సంస్థ మన దేశంలో పుట్టుకొచ్చింది. నియోలాక్టా లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (NLPL) పేరిట ఆసియాలో తల్లి పాలను విక్రయించే ఏకైక సంస్థగా పేరున్న ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ తల్లి పాలను విక్రయించడంపై ఇటీవల కొందరు యాక్టివిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసింది.