బిర్యానీ అంటే చిన్న పెద్దా, తేడా లేకుండా అందరికీ ఇష్టంగా తింటారు. అందులోనూ చికెన్ బిర్యానీ అంటే మరింత మోజు ఎక్కువ, అయితే చాలా మంది బిర్యానీ వండుకోవడానికి సమయం ఉండదు. అలాంటి వారు బయట రెస్టారెంట్లు, హోటల్స్ లో బిర్యానీ తింటుంటారు. సాధారణంగా ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ లో తింటే మనకు దాదాపు 250 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి దాదాపు 600 నుంచి 800 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది.