2011 సంవత్సరంలో ఈ ఒక్క పని చేసి ఉంటే...80 లక్షలు మీ సొంతం అయ్యేవి..ఏంటో తెలుసా..?

Published : Jul 03, 2022, 04:32 PM IST

అయ్యో పదేళ్ల క్రితం ఈ ఒక్క పని చేసి ఉంటే మనం కోటీశ్వరులం అయ్యే వాళ్లం అని ఎన్నో విషయాల్లో అనుకుంటాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారం, లేదా షేర్లలో ఆ రోజుల్లో కాస్త పెట్టుబడి పెట్టి ఉంటే ఈ రోజు ధన వంతులం అయ్యే వాళ్లం అని పశ్చాత్తాప పడుతుంటాం. అయితే నేడు అలాంటి పరిస్థితే అమెరికా డాలర్లకు వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం మీరు ఒక లక్ష డాలర్లను మీ వద్ద ఉంటే చాలు అవి మిమ్మల్ని మిలియనీర్లను చేసి ఉండేవి. అదెలాగో చూద్దాం. 

PREV
16
2011 సంవత్సరంలో ఈ ఒక్క పని చేసి ఉంటే...80 లక్షలు మీ సొంతం అయ్యేవి..ఏంటో తెలుసా..?

డాలర్‌తో రూపాయి మారకం విలువ నిరంతరం పడిపోవడం మనం గమనిస్తున్నాం. 10 సంవత్సరాల క్రితం  డాలర్ విలువకు, ఇప్పటి డాలర్ విలువకు చాలా తేడా ఉంది. ఆ లెక్కన కొన్ని డాలర్లను మన వద్ద ఉంచుకొని ఉంటే దాని విలువ నేడు  ఈ రోజు లాభం రెట్టింపు అయ్యేదని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే, ఒక లక్ష డాలర్లు ఉంచుకుంటే చాలు, ఈరోజు మీరు 80 లక్షల రూపాయలకు యజమానిగా మారి ఉండేవారు. 

26

డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డాలర్‌తో రూపాయి మారకం విలువ దాదాపు 6 శాతం క్షీణించింది. ప్రస్తుతం US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 79.11 రికార్డు స్థాయికి చేరుకుంది. నిజానికి మన దేశం ముడి చమురు సహా విలువైన లోహాలు (బంగారం, వెండి) సహా చాలా వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. 

36

దిగుమతి చేసుకున్న వస్తువులకు అమెరికా డాలర్ల రూపంలో బిల్లును భారత్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని కారణంగా భారతదేశం డాలర్లలో ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.

46

ఇక 2011 సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ.46 నుంచి రూ.54 మధ్య ఉంది. 2011లో డాలర్‌తో పోలిస్తే రూపాయి అత్యధికంగా రూ.54 వద్ద పతనం అయ్యింది. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్టంగా రూ.43 పడిపోయింది. సగటు ధర గురించి మాట్లాడినట్లయితే, అది రూ. 46 నుండి 47 మధ్యలో ఉంది.

56

2011 సంవత్సరంలో మీ వద్ద ఒక లక్ష డాలర్లు (రూ. 44.8 లక్షలు) ఉంటే, ఈరోజు మీరు దాదాపు 80 లక్షల రూపాయలకు యజమాని అయ్యేవారు. వాస్తవానికి 2011లో లక్ష డాలర్ల విలువ రూ. 44.8 లక్షలు. అయితే ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయి దాదాపు 80 రూపాయల సమీపానికి చేరుకుంది.

66

నేటి తేదీలో మీరు భారతీయ రూపాయలకు ఒక లక్ష డాలర్లను మార్చినట్లయితే, ఎటువంటి ప్రయత్నం లేకుండా, మీకు 79 లక్షల రూపాయల కంటే ఎక్కువ లభించేది. మీరు నేరుగా 65 శాతం లాభం పొందారని అర్థం. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం ఇంకా కొనసాగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories