ఆటో డ్రైవర్ తాను ప్రతినెలా రెండు నుండి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పారు. అంటే ఒక పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంపాదించే జీతంతో ఈ ఆదాయం సమానం. అలాగే బెంగళూరులో తనకు నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయలు విలువైన రెండు ఇల్లు కూడా ఉన్నాయని చెప్పాడట ఆటోడ్రైవర్. తనకు వస్తున్న ఆదాయంలోంచి కొంత భాగాన్ని దాచిపెట్టి ఒక ఏఐ స్టార్టప్ లో పెట్టుబడి కూడా పెట్టినట్టు చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులాంటి బిజీ సిటీలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కూడా అధిక మొత్తంలోనే సంపాదిస్తున్నారు. అక్కడ జనాభా అధికంగా ఉండడం, ముఖ్యంగా ఐటీ సెక్టార్ మొత్తం బెంగళూరులోనే తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల క్యాబ్ సర్వీసులు, ఆటో సర్వీసులకు భారీగా లాభాలు వస్తున్నాయి.