DMart: తక్కువ ధరకే వస్తువులు కావాలంటే అందరూ డిమార్ట్ కే పరుగులు పెడతారు. అయితే ఇప్పుడు మిగతా స్టోర్లు కూడా తక్కువ ధరకు ఉత్పత్తులు ఇచ్చేందుకు ప్రయ్నతిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పెరిగాయి.
ఇంటి సామానులు కొనే విషయంలో అందరికి గుర్తొచ్చేది డిమార్ట్. అయితే ఇప్పుడు డిమార్ట్ దానికంటే తక్కువ ధరకే వస్తువులు అందించే కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ వేదికలు పెరిగాయి. తక్కువ ధరలను అందిస్తూ ఆఫర్లను ఇస్తూ వేగంగా డెలివరీలను అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఆకర్షితులవుతున్నారు. ఏ స్టోర్లు డి మార్ట్ కన్నా తక్కువ ధరకు అందిస్తున్నాయో తెలుసుకోండి.
24
వీటిలోనూ ఆఫర్లు
జియో మార్ట్, రిలయన్స్ స్మార్ట్ బజార్, బిగ్‌బాస్కెట్ వంటివి డి మార్ట్‌కు గట్టి పోటీని ఇస్తున్నాయి. జియోమార్ట్ కొన్ని వస్తువులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా పప్పులు, నూనె, టూత్‌బ్రష్, సాస్ లు వంటి వాటిపై తక్కువ ధరకే లభిస్తున్నాయి. రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో కూడా కూరగాయలు, కిరాణా, బిస్కెట్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
34
బిగ్ బాస్కెట్
బిగ్‌బాస్కెట్‌లో ఆర్గానిక్ వస్తువులు, చిరుధాన్యాలు మంచి నాణ్యతతో తక్కువ ధరకే దొరుకుతాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి 10-20 నిమిషాల్లో డెలివరీ చేస్తాయి. ఈ యాప్స్‌లో కిరాణా, స్నాక్స్ కొన్నిసార్లు డి-మార్ట్ కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. వెంటనే కావాలనుకుంటే అవసరాలకు ఇవి మంచి ఆప్షన్స్.
కేవలం డిమార్ట్ మాత్రమే కాదు రిలయన్స్ స్మార్ట్ పాయింట్, విశాల్ మెగా మార్ట్, నీలగిరిస్ వంటి స్టోర్లు కూడా కిరాణా సామానులు తక్కువ ధరకే అందిస్తున్నాయి. డి మార్ట్ లాగే తక్కువ ధరలకు గృహోపకరణాలను అందిస్తాయి. విశాల్ మెగా మార్ట్‌లో బట్టలు, గృహోపకరణాలు కొన్నిసార్లు డి-మార్ట్ కన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి డి-మార్ట్ మాత్రమే కాకుండా, ఇతర స్టోర్లలోనూ తక్కువ ధరకే వస్తువులు కొని డబ్బు ఆదా చేయవచ్చు.