తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకుంటున్నారా? మనదేశంలో అనేక బైకులు మంచి మైలేజ్ ఇస్తున్నాయి. ఇవి రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లేవారికి ఉపయోగపడతాయి. 100cc నుంచి 110cc ఇంజిన్‌తో కమ్యూటర్ బైక్‌లు వస్తున్నాయి. ఇవి తక్కువ ధరలో దొరకడమే కాకుండా, పెట్రోల్ కూడా ఆదా చేస్తాయి. సుమారు రూ.70,000 బడ్జెట్‌లో కూడా మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనొచ్చు.
పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో, 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకే అందరూ ఆసక్తి చూపిస్తారు. అందుకే హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు రోజూ ప్రయాణాలకు అనువైన బైక్‌లను తయారు చేస్తున్నాయి. వీటికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.