Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..

Published : Mar 06, 2026, 08:31 PM IST

Stock: ఫార్మా రంగంలోని స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ 'క్యూపిడ్ లిమిటెడ్' తన షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4:1 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు రికార్డు తేదీని ఖరారు చేసింది. గత ఏడాది కాలంలో 515 శాతానికి పైగా లాభాలను.. 

PREV
15
షేర్ హోల్డర్లకు తీపి కబురు

ఫార్మా సెక్టార్‌కు చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ క్యూపిడ్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు తీపి కబురు అందించింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ బోనస్ షేర్ల జారీకి సంబంధించి రికార్డు తేదీని ప్రకటించింది. కండోమ్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ, 4:1 రేషియోలో బోనస్ షేర్లను ఇవ్వడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు.

25
బోనస్ రేషియో, రికార్డు తేదీ:

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, రికార్డు తేదీ నాటికి కంపెనీలో 1 ఈక్విటీ షేరు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు అదనంగా 4 బోనస్ షేర్లు ఉచితంగా లభిస్తాయి. ఈ బోనస్ షేర్లకు అర్హులైన వారిని నిర్ణయించే రికార్డు తేదీని మార్చి 9, 2026గా నిర్ణయించారు. అంటే, మార్చి 6వ తేదీ మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్లను కొనుగోలు చేసిన లేదా కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ బోనస్ ఆఫర్‌కు అర్హులు అవుతారు.

35
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

క్యూపిడ్ లిమిటెడ్ షేరు గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది సుమారు 515 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలలు 120 శాతం వృద్ధిని సాధించింది.

45
స్టాక్ పనితీరు - మల్టీబ్యాగర్ రిటర్న్స్:

గత ఐదేళ్లు ఈ స్టాక్ ఏకంగా 3825 శాతం లాభాన్ని ఇచ్చింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ. 38 లక్షలకు పైగా ఉండేది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 414 పరిసరాల్లో ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 526.95 కాగా, కనిష్ట ధర రూ. 55.75. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 11,230 కోట్లుగా ఉంది.

55
బోనస్ షేర్లు అంటే ఏమిటి?

కంపెనీ తన వద్ద ఉన్న నిల్వలను ఉపయోగించి ఉన్న షేర్ హోల్డర్లకు అదనపు షేర్లను ఉచితంగా ఇవ్వడాన్ని బోనస్ ఇష్యూ అంటారు. దీనివల్ల షేర్ల సంఖ్య పెరుగుతుంది కానీ, షేరు ధర ఆ నిష్పత్తిలో సర్దుబాటు చేయబడుతుంది. దీనివల్ల మార్కెట్లో షేర్ల లిక్విడిటీ పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories