"త్యాగాలు ఉంటాయి": గూగుల్ గ్రీన్ క్యాంపస్ టెస్ట్‌లో సుందర్ పిచాయ్..

Ashok Kumar   | Asianet News
Published : Oct 18, 2021, 04:17 PM IST

గూగుల్ సంస్థ  సరికొత్త క్యాంపస్ మూడు స్క్వాట్ భవనాలగల గూగుల్ బే వ్యూ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలోని ప్రధాన కార్యాలయానికి తూర్పున కొన్ని మైళ్ల దూరంలో శాన్ ఫ్రాన్సిస్కో బే తీరానికి సమీపంలో ఉంది. అయితే ఈ  భవనాలలో సందర్శకులు ముఖ్యంగా గమనించే మొదటి విషయాలు దాని పైకప్పులు.  

PREV
"త్యాగాలు ఉంటాయి": గూగుల్ గ్రీన్ క్యాంపస్ టెస్ట్‌లో సుందర్ పిచాయ్..

సర్కస్ టెంట్ వంటి పై కప్పు పై నుండి మెల్లగా క్రిందికి వంగి దాదాపు భూమికి అనుతున్నట్టు ఉంటుంది. ప్రతి పైకప్పు అంచులలో బ్రష్ చేసిన మెటల్ షీన్‌తో మెరుస్తున్న సోలార్ ప్యానెల్స్‌తో కప్పబడి ఉంటుంది. గూగుల్ ఈ డిజైన్‌ని డ్రాగన్‌స్కేల్ అని పేరు పెట్టింది.


గూగుల్ కొత్త క్యాంపస్‌ని పూర్తిగా కార్బన్ లేకుండా  కార్యకలాపాలను నిర్వహించాలనే గొప్ప ఆశయంగా భావించింది. అయితే కరోనా మహమ్మారిని వ్యాప్తి బట్టి పరిమిత సంఖ్య ఉద్యోగులతో వచ్చే జనవరిలో బే వ్యూను తెరవాలని కంపెనీ యోచిస్తోంది. భవనాల క్రింద వేలాది కాంక్రీట్ స్తంభాలు భూమిలోకి ఉండడంతో ఒక విధమైన జియోథర్మల్ బ్యాటరీగా ఉపయోగపడుతుంది, వేడిని స్టోర్ చేస్తూ భవనాన్ని వెచ్చగా  చేయడానికి ఇంకా న్యాచురల్ గ్యాస్ లేకుండా నీటి సరఫరాను అందిస్తుంది. ఈ  రూఫ్ ప్యానెల్స్ కాంతిని నివారించడానికి ఒక ప్రత్యేకమైన ఆకృతి గల గ్లాస్‌తో  లోపల ఉన్న విశాలమైన అట్రియాలోకి మృదువైన, ప్రకాశించే కాంతిని విడుదల చేసేందుకు నిర్మించబడ్డాయి. "మేము దీనిని కేథడ్రల్ ఆఫ్ వర్క్ అని పిలుస్తాము" అని గూగుల్  రియల్ ఎస్టేట్ విభాగంలో ఎనర్జి డెసిషన్స్ పర్యవేక్షించే అసిమ్ తాహిర్ చెప్పారు.  

ఆల్ఫాబెట్ ఇంక్ అండ్ గూగుల్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఈ భవనం లుక్ కోసం ఒకసారి ప్రయత్నించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో నిర్మాణ సిబ్బంది అతిథులు అలాగే దాని యజమాని ప్రవేశాన్ని కూడా పరిమితం చేయడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేశారు.  


గత సంవత్సరం సుందర్ పిచాయ్ గూగుల్ అన్ని కార్యాలయాలను, డేటా సెంటర్‌ని క్లీన్ సోర్సెస్ విద్యుత్తుపై నుండి నిరంతరం పనిచేసేల గూగుల్ ప్రణాళికను ప్రకటించాడు. ఇందుకు 2030 డెడ్ లైన్ గా నిర్ణయించాడు.

ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ వెబ్ సెర్చ్‌లు, ఇమెయిల్‌లు, మ్యాపింగ్ మార్గాలను అందించే సర్వర్‌లను కలిగి ఉన్న గూగుల్  డేటా సెంటర్లు విద్యుత్ వినియోగానికి చాలా కారణమవుతాయి. 2020లో 15.1 మిలియన్ మెగావాట్ల గంటలు వినియోగించింది. గత సంవత్సరం గూగుల్ 67 శాతం డేటా  సెంటర్ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక వనరులతో జరిగింది. అంటే గత సంవత్సరం కంటే 6 శాతం ఎక్కువ. ఓక్లహోమా, ఒరెగాన్ వంటి కొన్ని ప్రదేశాలలో డేటా సెంటర్లు 90 శాతం క్లీన్ సోర్స్‌లకు దగ్గరగా లేదా అంతకు మించి నడుస్తాయి.


కానీ ఇతర చోట్ల కార్బన్‌ని నిర్మూలించడం  ఒక పెద్ద సవాలు, గూగుల్ సాధారణ కార్పొరేట్ లక్ష్యాలకు మించి లక్ష్యంగా పెట్టుకుంది. డజన్ల కొద్దీ కంపెనీలు వాటి ఎనర్జి వినియోగాన్ని పునరుత్పాదక వనరులు లేదా ఆఫ్‌సెట్‌లతో కవర్ చేస్తూ కార్బన్ న్యూట్రాలిటీని చేరుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 

ఆపిల్ ఇంక్  స్వంత ఆపరేషన్స్ తో కార్బన్ న్యూట్రాలిటీని సాధించింది. 2030 నాటికి  సప్లయి ఛైన్ తో ఇలాగే కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేసింది. Amazon.com Inc. 2040 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ ఉంటుందని వాగ్దానం చేసింది. కానీ గూగుల్ మరింత ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.  
 

click me!

Recommended Stories