జెట్ ప్లేన్స్ ఇంధన ధరలను మించిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకి ఎంతంటే ?

First Published Oct 18, 2021, 1:11 PM IST

న్యూఢిల్లీ: వరుస నాలుగు రోజుల పెంపు తర్వాత నేడు పెట్రోల్ (petrol), డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు స్థిరంగా ఉంచాయి. ధరల సవరణ లేనప్పటికి పెట్రోల్, డీజిల్ (diesel)ధరలు ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరాయి. ఇంధన ధరలు చివరగా లీటరుకు 35 పైసలు పెరిగింది.
 

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.84, ముంబైలో లీటరుకు రూ. 111.77 గరిష్ట స్థాయికి పెరిగింది. ముంబైలో డీజిల్ ఇప్పుడు లీటరుకు రూ. 102.52 కి  చేరగా, ఢిల్లీలో  ధర రూ.94.57గా ఉంది. అయితే అక్టోబర్ 12, 13 తేదీలలో ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో గత 23 రోజుల్లో 19 సార్లు డీజిల్ ధరపై  మొత్తంగా రూ .5.95 పెరిగింది.

డీజిల్ ధరల పెంపుతో  దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు రూ .100 కి పైగా చేరింది. అయితే  కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ .100 దాటిన సంగతి మీకు తెలిసిందే.సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్ ధరలు స్థిరత్వాన్ని కొనసాగించాయి, అయితే చమురు కంపెనీలు చివరగా గత వారంలో ధరలను పెంచాయి. పెట్రోల్ ధరలు కూడా గత 19 రోజుల్లో 16 రోజులకు పెరిగింది దీంతో ధర లీటరుకు రూ. 4.65 పెరిగింది.
 

ముడి చమురు (crude oil)ధర ఇప్పుడు మూడు సంవత్సరాల గరిష్ట స్థాయి బ్యారెల్‌కి 84.6.6 డాలర్లకు పైగా పెరుగుతోంది. సెప్టెంబర్ 5 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు రెండింటినీ సవరించినప్పుడు, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధర ఆగస్టులో సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 9-10 డాలర్లు పెరిగింది.
 

పెట్రోల్, డీజిల్ ధరలు విమానయాన సంస్థలకు  విక్రయించే జెట్ ఇంధనం(jet fuel) ధర కంటే ఇప్పుడు  30% ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అందువల్ల.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
 

click me!