నేటి నుంచి వారం రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి..

First Published Oct 18, 2021, 10:51 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 18 సోమవారం నుండి వచ్చే వారం వరకు భారతదేశం అంతటా ఆరు రోజుల పాటు బ్యాంకులు(banks) మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్టోబర్ నెలలో పండుగల కారణంగా దేశం వ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు వరుస హాలిడేస్ రానున్నాయి. 

మీరు ఈ నెలలో ఏదైనా బ్యాంక్ పని చేయాల్సి ఉంటే ముందుగా బ్యాంక్ హాలిడేస్(bank holidays) గురించి తెలుసుకోండి.  అయితే  వివిధ ప్రాంతాల్లో పండుగలు, సంబరాలు ఆయా ప్రాంతాల్లో వాటికుండే ప్రాధాన్యత ప్రకారం బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించడం జరిగింది. వీటికి తోడు సాధారణ సెలవులు(2వ, 4వ శనివారం, ఆదివారం), ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. 

అక్టోబర్ మొదటి 15 రోజుల్లో 11 రోజులు బ్యాంకులు మూసివేయబడ్డాయి. అక్టోబర్ 16 శనివారం దుర్గా పూజ సందర్భంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో, అక్టోబర్ 17 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి.

అక్టోబర్‌ మొత్తంలో 21 రోజులు బ్యాంకులకు సెలవులు 

 అక్టోబర్ 18 – అస్సాంలోని గౌహతిలో కాటి బిహు పండుగ కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 19 – మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా.. న్యూఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, బేలాపూర్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురంలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగవు.
అక్టోబర్ 20 – వాల్మీకి జయంతి సందర్భంగా బెంగళూరు, చండీగఢ్, సిమ్లా, కోల్‌కతా, అగర్తలాలో బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 22 – ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ సందర్బంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 23 – నాల్గవ శనివారం కారణంగా భారతదేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే.
అక్టోబర్ 24 – ఆదివారం కారణంగా బ్యాంకులన్నీ బంద్.

ఆర్‌బిఐ సెలవులను మూడు కేటగిరీలలో ఉంటాయి: నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్  హాలిడేస్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడేస్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్, బ్యాంకుల అకౌంట్స్ క్లోజింగ్. గత నెల సెప్టెంబర్ లో కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు 12 రోజుల పాటు మూసివేశారు. ఈ సెలవు దినాలలో బ్యాంక్ కార్యాలయాలు మాత్రమే మూసివేయడం జరుగుతుంది. ఏ‌టి‌ఎం(atm) కేంద్రాలు, ఆన్‌లైన్ సేవలు యధాతథంగా కొనసాగుతాయి.

click me!