Cheapest currency
ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణం, పేదరికం తదితర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు భారతీయ రూపాయి కంటే చాలా తక్కువ విలువ కలిగి ఉన్నాయి.
ఉగాండా షిల్లింగ్
ఉగాండా కరెన్సీని ఉగాండా షిల్లింగ్ (USH) అంటారు. 44.2 ఉగాండా షిల్లింగ్‌లు ఒక భారతీయ రూపాయికి సమానం. ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ దేశం అభివృద్ధిలో వెనుకబడింది.
కాంబోడియన్ రీల్
కంబోడియ.. ఈ దేశ కరెన్సీ కాంబోడియన్ రీల్ (KHR). ఇక్కడ ఒక ఇండియన్ రూపాయి (INR) 49 KHRలతో సమానం. ఈ దేశంలోనూ ఆర్థిక సమస్యలు, ద్రవ్యోల్బణంలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి.
పరాగ్వే గ్వారానీ(PYG)
పరాగ్వే దేశ కరెన్సీ పరాగ్వే గ్వారానీ(PYG). ఈ దేశంలో అవినీతి మరియు పేదరికం కారణంగా కరెన్సీ విలువను స్థిరంగా కొనసాగించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఒక ఇండియన్ రూపాయి 90 PYG లతో సమానం.
గినియన్ ఫ్రాంక్ (GNF)
గినియా దేశ కరెన్సీ గినియన్ ఫ్రాంక్ (GNF). అవినీతి మరియు రాజకీయ అస్థిరత గినియా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తోంది. ఈ దేశంలో 1 INR.... 102.9 GNF గా ఉంది.
ఉజ్బెకిస్తానీ సోమ్
ఉజ్బెకిస్తాన్ కరెన్సీ పేరు ఉజ్బెకిస్తానీ సోమ్(UZS). ఇక్కడ ఒక భారతీయ రూపాయి విలువ 150.4 ఉజ్బెకిస్తానీ సోమ్‌లతో సమానంగా ఉంటుంది.
ఇండోనేషియా రూపాయి (IDR)
ఇండోనేషియా.. ఈ దేశ కరెన్సీ పేరు రూపాయి. అయితే ఇండోనేషియా రూపాయి (IDR) అంటారు. ఒక INR (ఇండియన్ రూపాయి) 193.6 IDRతో సమానం. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇండోనేషియా రూపాయి విలువ చాలా తక్కువగా ఉంది.
లావోషియన్ కిప్ (LAK)
లావోస్ దేశ కరెన్సీ పేరు లావోషియన్ కిప్ (LAK). ఇక్కడ ఒక ఇండియన్ రూపాయి.. 262.7 లావోషియన్ కిప్ (LAK)లతో సమానం.
సియెర్రా లియోనియన్ లియోన్ (SLL)
సియర్రా లియోన్ దేశ కరెన్సీ పేరు సియెర్రా లియోనియన్ లియోన్ (SLL). పేదరికం, అవినీతి, చారిత్రక సంఘర్షణల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లతో ఈ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక్కడ ఒక ఇండియన్ రూపాయి... 270 SLLతో సమానం.
వియత్నామీస్ డాంగ్ (VND)
వియత్నాం దేశ కరెన్సీని వియత్నామీస్ డాంగ్ (VND) అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఇండియన్ రూపాయి ... 304.7 వియత్నామీస్ డాంగ్‌లతో సమానం.
ఇరానియల్ రియాల్ (IRR)
ఇరాన్ దేశ కరెన్సీ ఇరానియల్ రియాల్ (IRR). ఇక్కడ 1 ఇండియన్ రూపాయి 504.4 ఇరానియల్ రియాల్‌తో సమానం. ఈ దేశంలో అధిక ఆంక్షలు, ద్రవ్యోల్బణం కారణంగా ఇరానియల్ రియాల్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తక్కువ విలువ కలిగిన కరెన్సీగా నమోదయింది.