Gold Prices May Rise by Rs 18,000: కేంద్ర బడ్జెట్ 2024-25 లో సుంకాలు తగ్గించడంతో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ముందు కూడా బంగారం ధరలు పడిపోతాయనే అంచనాల మధ్య బులియన్ మార్కెట్ నిపుణులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
gold rate
ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ 2024-25లో దిగుమతి సుంకం తగ్గింపుతో పాటు అమెరికా ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరల ఒత్తిడితో భారత్ లో బంగారం ధరలు రూ.4,000 వరకు తగ్గాయి.
gold rate
అయితే, కొన్ని రోజులకే దాదాపు రూ.18000 పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరల పరిస్థితిని కొనుగోలు-అమ్మకం స్ట్రాటజీగా పేర్కొంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బంగారం ధరలు నిపుణులు ప్రధాన కొనుగోలు అవకాశంగా అభివర్ణిస్తున్నారు. గ్లోబల్ సంకేతాలు సంభావ్య పెరుగుదలను సూచిస్తున్నందున, పెట్టుబడిదారులు ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం గురించి ఆలోచించాలనీ, ధరలు రూ. 72,000కి చేరుకున్నప్పుడు విక్రయించాలని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్కేపీ సెక్యూరిటీస్‌లో పరిశోధన (కమోడిటీ-కరెన్సీ) వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిని ఒక ముఖ్యమైన కొనుగోలు అవకాశంగా నొక్కిచెప్పారు. "ఇటీవల బంగారం ధరలు రూ. 75,000 నుండి దాదాపు రూ. 70,000కి తగ్గడం గణనీయమైన కొనుగోలు అవకాశాన్ని అందిస్తోంది. న్యూయార్క్‌కు చెందిన కామెక్స్ బంగారం ఇటీవల మొదటిసారిగా $2,500కి చేరుకోవడంతో, రూపాయి పరంగా ఇది అతిపెద్ద ఒకే రోజు క్షీణతను సూచిస్తుంది. రూ. 4,200 తగ్గడంతో కొనుగోలుదారులు బంగారానికి తమ కేటాయింపులను పెంచుకోవడాన్ని పరిగణించాలి, ప్రత్యేకించి ఈక్విటీలపై అధిక మూలధన లాభాల పన్నుకు అవకాశం ఉందన్నారు.
ప్రస్తుత బంగారం వెండి ధరలు గమనిస్తే.. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 24కే బంగారం ధరలు వరుసగా 999, 995 స్వచ్ఛతతో 10 గ్రాములకు రూ.68,100, రూ.67,800గా ఉన్నాయి. వెండి కిలో ధర రూ.82,000గా ఉంది.