iPhone 18 price: ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. దీని ధరే కాదు ఫీచర్లు కూడా అద్భుతమే

Published : Mar 27, 2026, 11:01 AM IST

iPhone 18 price: ఐఫోన్ సిరీస్ వస్తుందంటే చాలు ఐఫోన్ ప్రియులంతా కొనేందుకు క్యూలు కడతారు. త్వరలో ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాబోతోంది. దీని ధర ఎంత ఉండవచ్చు? ఎలాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందో తెలుసుకోండి. 

PREV
14
ఐఫోన్ 18 మార్కెట్లోకి ఎప్పుడు?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఐఫోన్ కు అభిమానులు ఉన్నారు. ఐఫోన్ సిరీస్ వస్తుందంటే చాలు రాత్రి నుంచే క్యూలో నిలబడి కొనేవారు ఎంతోమంది. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్ త్వరలో విడుదల చేయబోతోంది. ఇప్పటినుంచే వాటిపై చర్చ మొదలైపోయింది. ఐఫోన్ 17 సిరీస్ ఇప్పటికే మార్కెట్లో మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఐఫోన్ 18 కూడా అలాంటి విజయాన్నే అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు 2026 సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

24
ఐఫోన్ 18 ధర ఎంత?

మనదేశంలో ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ ధరలు సుమారు 1,34,900 రూపాయల నుంచి ప్రారంభం అవుతుందని అంచనా. ఇక ప్రో మాక్స్ ద్వారా రూ. 1,54,900 వరకు ఉండవచ్చు. ఇది పూర్తిగా ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేసే ఫోన్లు. ఈసారి ఐఫోన్ 18 లో ప్రధాన ఆకర్షణ కొత్త A20 ప్రొ చిప్. ఇది 2నానో మీటర్ టెక్నాలజీతో తయారవుతుంది. దీనివల్ల ఫోను వేగంగా పనిచేయడమే కాదు బ్యాటరీ పనితీరు కూడా పెరుగుతుంది.

34
వీడియో ఎడిటింగ్ కూడా

ఈ ఫోన్లో గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి మీక్కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. 12 జిబి ర్యామ్, 1 TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి. డిస్ ప్లే విషయంలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రో మోడల్ 6.3 అంగుళాల స్క్రీను, ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల ఓఎల్ఈడి డిస్ ప్లేతో రావచ్చు. స్మూత్ స్క్రోలింగ్, బ్రైట్ స్క్రీన్ వంటి ఫీచర్లు యూజర్లకు మరింత నచ్చుతాయి.

44
కెమెరా పవర్ ఎంత?

ఇక కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 18 ప్రో సిరీస్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఎలాంటి లైటింగ్ కండిషన్స్ లో అయినా క్లియర్ ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోగ్రఫీ కోసం కూడా దీన్ని అద్భుతంగా వాడుకోవచ్చు. ఇందులో ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఉండొచ్చని అంచనా. అదనంగా కొత్త కలర్స్ కూడా రావచ్చు. ప్రీమియం ఫినిషింగ్, గట్టి బాడీతో దీర్ఘకాలికంగా ఉపయోగించుకోవడానికి ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. భారీ ధర ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఐఫోన్ కొనేందుకు కచ్చితంగా సిద్ధంగా ఉంటారు. ఒక్కసారి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే చాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు హ్యాపీగా వాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories