Silver Rules: ఇంట్లో ఎంత పడితే అంత వెండి ఉంచుకోవచ్చని అందరూ అనుకుంటారు. కిలోల కొద్దీ వెండిని ఉంచుకోవచ్చనుకుంటారు. ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవాలో ఆర్‌బీఐ, ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు ఉన్నాయి.
భారతదేశంలో బంగారం తరువాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వెండికే. బంగారు ఆభరణాలతో పాటూ వెండి వస్తువులు అధికంగా కొంటారు. ఇటీవలి కాలంలో వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారింది. అందుకే వెండిని కొనేవారు అధికంగా ఉంటారు. దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు.
25
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?
ఆదాయపు పన్ను చట్టం (1961) చెబుతున్న ప్రకారం మీరు ఇంట్లో ఎంత వెండి అయినా ఉంచుకోవచ్చు. అది కొన్నదైనా, వారసత్వంగా వచ్చినదైనా పర్వాలేదు. బంగారానికి ఉన్నట్టు వెండికి ఎలాంటి పరిమితి లేదు. మీరెంతైనా కొని పెట్టుకోవచ్చు.
35
వెండిపై పెట్టుబడి
అయితే వెండిని కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదులు లేదా బిల్లు దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్తులో కొన్ని పరిస్థితుల్లో ఐటీ శాఖ తనిఖీ చేస్తే ఆ వెండి చట్టబద్ధంగా కొన్నారని ఆధారం చూపించాలి. కాబట్టి ప్రతి వెండి వస్తువుకు సంబంధించిన రశీదు ఇంట్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది.
వెండిని పెట్టుబడిగా మీరు భావిస్తే.. దాన్ని అమ్మినప్పుడు పన్ను కచ్చితంగా కట్టాల్సి వస్తుంది. 24 నెలల్లోపు అమ్మితే, అది స్వల్పకాలిక మూలధన లాభం (STCG) అవుతుంది. 24 నెలల తర్వాత అమ్మితే, అది దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) అవుతుంది.
55
ఆర్‌బీఐ ఏం చెబుతోంది?
వెండి ఆభరణాలు, నాణాలు, ETF, మ్యూచువల్ ఫండ్ ఏ రూపంలో పెట్టుబడి పెట్టినా, దానికి చట్టపరమైన ఆధారం ఉంచుకోవాలి. వెండి నిల్వకు పరిమితి లేదు, కానీ బిల్లు ఉంటేనే భద్రత. కాబట్టి మీరు ఎంత వెండినైనా కొని దగ్గర పెట్టుకోండి. వాటికి సంబంధించిన ఆధారాలు మాత్రం జాగ్రత్తగా భద్రపరచండి.