ఎలాన్ మస్క్ ఉద్యోగ ఆఫర్
ఎలాన్ మస్క్ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టెస్లా కంపెనీ సీఈఓ అయిన ఎలాన్ మస్క్ కంపెనీలో ఉద్యోగాల కోసం వేలెత్తి చూస్తారు. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
టెస్లా
అయితే తాజాగా ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ వినూత్నమైన ఉద్యోగాన్ని ప్రకటించింది. రోజుకి ఏడు గంటలు నడిస్తే రూ. 28,000 (340 అమెరికన్ డాలర్లు) జీతం ఇస్తామంటుంది. అంటే గంటకు రూ. 4 వేలు మీ సొంతం అన్నమాట.
ఎలాన్ మస్క్
ఈ ఉద్యోగానికి ఆఫీసు పని ఏమీ ఉండదు. ప్రతి రోజు నిర్ణీత సమయం నడవడమే ప్రధాన విధి. అంతేకాదు వైద్య బీమా, పింఛను వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగం అమెరికాలో లభిస్తుంది.
టెస్లా ఉద్యోగ ఆఫర్
అంతేకాదు, ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. "డేటా కలెక్షన్ ఆపరేటర్" అని పిలువబడే ఈ ఉద్యోగం, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబోట్‌లకు శిక్షణ ఇవ్వడానికి టెస్లా చేస్తున్న ప్రయత్నంలో భాగం.
టెస్లాలో ఖాళీలు
ఈ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లను ధరించి తిరగాల్సి ఉంటుంది. దీని కోసం గంటకు సుమారు రూ. 4,000 (48 డాలర్లు) చెల్లిస్తారు. రోబోల పనితీరును మెరుగుపరచడానికి డేటాను సేకరించి విశ్లేషించడానికి ఈ ఉద్యోగం రూపొందించారు.
విచిత్రమైన ఉద్యోగాలు
వారు ఈ డేటాను సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ పరిశీలనల ఆధారంగా వివరణాత్మక నివేదికలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పాత్రకు దరఖాస్తుదారులు డేటా సేకరణ, విశ్లేషణలో నైపుణ్యం కలిగి ఉండాలి.
డేటా కలెక్షన్ ఆపరేటర్
దరఖాస్తుదారులు అర్హత సాధించడానికి కొన్ని షరతులు పూర్తి చేయాలి. 5'7" నుండి 5'11" వరకు ఎత్తు ఉండాలి. అంతేకాదు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగం ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఉంది.
ఉద్యోగ ఖాళీలు
అంతేకాదు, అర్హతలు, నైపుణ్యాలను బట్టి గంటకు రూ. 2,120 నుంచి రూ. 4,000 వరకు జీతం చెల్లిస్తారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఈ ఉద్యోగం ఒక విశిష్టమైన అవకాశాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.