ఇలా చేస్తే రూ. కోటి సంపాదించడం చాలా సులభం

First Published | Aug 31, 2024, 11:10 AM IST

రూ.కోటి సంపాదించండి ప్రతి మధ్య తరగతి వాడి కల. అయితే రూ.వేలల్లో వచ్చే జీతంతో రూ.కోటి సంపాదించడం సాధ్యమేనా.. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే మీకు తెలియకుండానే రూ. కోటి  మీ ఖాతాలోకి చేరతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
 

సాధారణంగా ధనవంతులు, సెలబ్రెటీలు రోజుకే రూ.కోట్లలో సంపాదిస్తారు. వారికి ప్రధాన ఆదాయ వనరు పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెటింగ్, సినిమాలు ఇలా అనేక రంగాల్లో వారు పెట్టే పెట్టుబడులు తక్కువ సమయంలోనే వారికి రూ.కోట్లు తెచ్చిపెడతాయి. మరి మధ్య తరగతి వ్యక్తులు ఆయా రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ తమ ఆశలను నెరవేర్చుకొనే ప్రయత్నాలు కూడా చేయలేరు. అయితే తెలివిగా ఆలోచించి సంపాదించే డబ్బులోనే ప్రతినెలా ఇలా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే రూ.కోటి సంపాదించవచ్చు. 
 

దీని కోసం మనం ఎంచుకోవాల్సిన రంగం స్టాక్ మార్కెట్. అసలు స్టాక్ మార్కెట్ అనగానే ఇక్కడ డబ్బులు పోగొట్టుకున్న వారే ఎక్కువ మంది ఉంటారని అందరూ భ్రమ పడుతుంటారు. ఇందులో కొంత వాస్తవమున్నప్పటికీ సరైన కంపెనీ, సరైన సమయంలో, సరైన చోట పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు పొందడం సులభమని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. మరి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎక్కడ పెట్టాలి. 
 


డబ్బులు దాచుకోవాలంటే అందరికీ ముందు గుర్తొచ్చేవి బ్యాంకులు, పోస్టాఫీసులు. అయితే ఇవి అనేక కారణాలతో అధిక వడ్డీని ఇచ్చే పరిస్థితి ఉండదు. RD, FD లతో పోలిస్తే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేస్తే అధిక రాబడిని ఇస్తాయి. ఉదాహరణకు, నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ మంచి లాభాలనిస్తాయి. 
 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ చిన్న పెట్టుబడి నిర్ణీత సమయంలోనే భారీ మొత్తంగా మారుతుందని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఆలోచనలతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడిని ఆశించే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. స్టేట్ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకు కావడంతో పాటు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తూ నమ్మకమైన బ్యాంకుగా ఉంది. అందువల్ల ఎస్బీఐలో పెట్టుబడులు చాలా సురక్షితంగా ఉంటాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 
 

ఎస్బీఐ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ.15 వేలు పెట్టుబడి పెట్టగలిగితే తక్కువ సమయంలోనే అవి కోటి రూపాయలు అవుతాయి. అదెలా అంటే నెలకు 15,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే అది ఏటా 12% రాబడిని ఇస్తుంది. ఇలా మీ పెట్టుబడి 211 నెలల్లో రూ.కోటికి చేరుతుంది. అంటే సుమారు 17 సంవత్సరాల అయిదు నెలలకు రూ.కోటి అవుతుంది. అదే మీరు నెలకు రూ. 20,000 పెట్టుబడి పెడితే మీరు 185 నెలల్లోనే అంటే 15 సంవత్సరాల నాలుగు నెలలకే రూ. కోటి సంపాదించవచ్చు. ప్రతి నెలా కచ్చితమైన ఖర్చుగా మీరు ఇన్వెస్ట్ చేస్తే అవసరమైన సమయంలో ఈ భారీ మొత్తం మీకు, మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. 

Latest Videos

click me!