రతన్ టాటా కలల కారు నానో కొత్త అప్డేట్ తో మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసింది. టాటా నానో ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా 2008లో మార్కెట్లోకి వచ్చింది. కుటుంబాలు పెద్దగా ఖర్చు చేయకుండా వాహన యజమాన్యాన్ని పొందాలని భావించి రతన్ టాటా ఈ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు. ప్రారంభంలో ఈ కారు 1 లక్ష రూపాయల ప్రాథమిక ధరతో మార్కెట్‌లోకి విడుదలైంది. ప్రారంభంగా దీని డిజైన్, ధర, భద్రతా లక్షణాలు మంచి స్పందనను పొందాయి.
టాటా నానోపై మొదట్లో ఆసక్తి కలిగినా, మార్కెట్‌లో దీని అమ్మకాలు ఆశించినంతగా జరగలేదు. ఆర్థికంగా తక్కువ పెట్టుబడి చేసినా కొన్ని సాంకేతిక సమస్యలు, భద్రతా అంశాలపై ప్రశ్నలు, కస్టమర్ల అభిరుచులు, రహదారి భద్రతా అంశాలు ఈ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.