బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే అంత ఫైన్ కట్టాలా? RBI రూల్స్ ఇవే!

First Published | Nov 5, 2024, 12:58 PM IST

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టుకోకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయని మీకు తెలుసు కదా.. కాని గత ఏడాది అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వారి నుంచి దాదాపు రూ.5,500 కోట్లు వసూలు చేశాయి. అంటే రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాని చాలా మంది RBI రూల్స్, గైడ్ లైన్స్ గురించి తెలుసుకోవడం లేదు. కస్టమర్లు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు విధించే జరిమానాలు, తదితర విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

మనందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. కానీ ఆయా బ్యాంకులు పెట్టే రూల్స్ గురించి చాలా మందికి తెలియవు. RBI పెట్టిన మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మీరు కొంత ఫైన్ కట్టాలి. మినిమమ్ బ్యాలెన్స్ లేదని మీరు గుర్తించకపోయినా మీరు డబ్బులు వేసిన తర్వాత ఆటోమెటిక్ గా ఫైన్ అమౌంట్ కట్ అయిపోతుంది. ఇలా దేశంలోని అన్ని బ్యాంకులు కలిసి దాదాపు రూ.5500 కోట్లు సంపాదించాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. మినిమమ్ బ్యాలెన్స్ విషయమే కాదు, రూల్స్ మార్చిన ప్రతి సందర్భాన్ని RBI తరచూ సర్క్యులర్స్ ఇస్తూ రూల్స్ గురించి ప్రజలకు, బ్యాంకులకు తెలియజేస్తుంది.

బ్యాంకు రూల్స్ తెలుసుకోవడం కస్టమర్ బాధ్యత. ఎక్కడ ఎంత కట్టాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ గురించి RBI రూల్స్ పెట్టింది. చాలా బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే జరిమానా వేస్తాయి. ఈ జరిమానా 400 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. డబ్బులు లేనప్పుడు బ్యాంకు జరిమానా వేస్తే మీ బ్యాలెన్స్ మైనస్ అవుతుంది. అలా జరిగితే మీపై బ్యాంకులకు క్రెడిబులిటీ పోతుంది. మీకు అర్హత ఉన్నా కొన్ని స్కీమ్స్ కు మీరు ఎలిజబులిటీ సాధించలేరు. 


వాస్తవానికి RBI రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు జరిమానా వేయొచ్చు. కాని ఆ జరిమానా వల్ల మీ ఖాతా బ్యాలెన్స్ మైనస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులదే. దీనర్థం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్ జరిమానా కట్టక్కర్లేదని కాదు. జరిమానా వేస్తే మినిమమ్ బ్యాలెన్స్ మైనస్ అవుతుంది. ఇలాంటి ఖాతాలున్న బ్యాంకులపై ఆర్బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ బ్యాంకులపైనే ఉంటుంది. 

ఎవరైతే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయరో వారిని ఆ బ్యాంకులు హెచ్చరించాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలా ప్రోత్సహించాలి. 

RBI కొత్త సర్క్యులర్ ప్రకారం కస్టమర్ల ఇబ్బందులు, అజాగ్రత్త వల్ల బ్యాంకులు జరిమానా వసూలు చేయకూడదు. మినిమమ్ బ్యాలెన్స్ కంటే తక్కువైతే బ్యాంకులు వెంటనే కస్టమర్లకు చెప్పాలి. జరిమానాల గురించి కస్టమర్లకు బ్యాంకులు ముందే చెప్పాలి. రూల్స్ ప్రకారం జరిమానా వేయకుండా ఆ ఖాతాలో ఇచ్చే సదుపాయాలు తగ్గించాలి. బ్యాంకులు ఆ ఖాతాలను బేసిక్ బ్యాంకింగ్ ఖాతాలుగా మార్చాలి. మళ్ళీ మినిమమ్ బ్యాలెన్స్ వస్తే రెగ్యులర్ ఖాతాగా మార్చాలి.

మీరు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిస్తే కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్ పెట్టుకుంటాయి. అంటే రూ.10 వేలు అనుకుంటే ఆ ఖాతాలో కనీసం అంత డబ్బు ఉండాలి. మీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే మీరు జరిమానా కట్టాలి. కానీ బ్యాలెన్స్ సున్నా అయితే RBI రూల్స్ ప్రకారం జరిమానా వేయకూడదు. ఎందుకంటే అది ఖాతాను మైనస్‌లోకి తీసుకెళ్తుంది. బ్యాంకులు అందించే సదుపాయాలు మీకు సక్రమంగా అందాలంటే మీరు తప్పకుండా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 

Latest Videos

click me!