ఆక్టివా 7G ఆధునిక మెరుగుదలలతో ప్రసిద్ధి చెందిన ఆక్టివా డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షార్ప్ బాడీ లైన్స్, స్లీక్ LED లైటింగ్, మెరుగైన డిజైన్ లాంగ్వేజ్ వంటి సూపర్ లుక్ తో పాటు స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది వేగం, ఇంధన స్థాయి, ట్రిప్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. హోండా ఆక్టివా 7Gని 110cc ఇంజిన్‌తో మెరుగైన పనితీరు, ఇంధన సామర్థ్యానికి రూపొందించారు.