మరోసారి టాప్‌ కంపెనీగా టీసీఎస్‌.. మార్కెట్‌ క్యాప్‌లో యాక్సెంచర్‌ను అధిగమించి అరుదైన ఘనత..

First Published Jan 26, 2021, 11:48 AM IST

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టిసిఎస్) మరోసారి 169.25 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజి సంస్థగా అవతరించింది. టిసిఎస్ కంపెనీ సోమవారం యాక్సెంచర్‌ను అధిగమించింది మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
 

బ్లూమ్స్ బెర్గ్ డేటా ప్రకారం, టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ విలువ సోమవారం వాణిజ్య ముగింపులో 169.25 బిలియన్ డాలర్లకు చేరుకోగా, యాక్సెంచర్ ఎం-క్యాప్ 168.68 బిలియన్ డాలర్లు. అక్టోబరులో టిసిఎస్ యాక్సెంచర్‌ను బీట్ చేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటి సేవల సంస్థగా అవతరించింది.
undefined
టిసిఎస్ షేర్లు సోమారం సెన్సెక్స్‌లో 3290.20 వద్ద ముగిశాయి, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 0.40% తగ్గింది. బెంచ్ మార్క్ ఇండెక్స్ 1.09% కోల్పోయి 48347.59 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లో టిసిఎస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను అధిగమించి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా దేశంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
undefined
సోమారం సెన్సెక్స్‌ ముగిసిన తరువాత టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్, 12,34,609.62 కోట్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బిఎస్ఇలో, 12,29,661.32 కోట్లుగా ఉంది. దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అయిన టిసిఎస్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం, 8,701 కోట్లతో 7% వృద్ధిని నమోదు చేసింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం, 8,118 కోట్లు.
undefined
ఈ త్రైమాసికంలో ఆదాయం 5.42% పెరిగి 42,015 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 39,854 కోట్ల రూపాయలుగా ఉంది. టి‌సి‌ఎస్ సంస్థ దాని పోటీదారుల కంటే ముందుకెళ్లడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్ 2018లో, టిసిఎస్ 100 బిలియన్ల వాల్యుయేషన్ మార్కుకు చేరుకుంది.
undefined
click me!