ఆర్‌బి‌ఐ మరో షాకింగ్‌ న్యూస్‌.. త్వరలో మళ్ళీ నోట్ల రద్దు..?

First Published Jan 23, 2021, 3:49 PM IST

 న్యూ ఢీల్లీ: ఈ  కొత్త సంవత్సరంలో  ఆర్‌బి‌ఐ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  రూ .100, రూ.10, రూ .5  పాత కరెన్సీ నోట్లను రద్దు చేయాలని యోచిస్తోంది. మార్చి చివరి నాటికి, లేదా ఏప్రిల్ లోగా  రూ .100, రూ.10, రూ .5 నోట్లు చెలామణిని శాశ్వతంగా రద్దు  చేయాలని యోచిస్తోంది.

కొన్ని మీడియా సంస్థలు నివేదించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) జి మహేష్ జిల్లా స్థాయి భద్రతా కమిటీ (డిఎల్ఎస్సి), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (డిఎల్ఎంసి) సమావేశంలో మాట్లాడుతూ పాత రూ .100, రూ .10 మరియు రూ .5 కరెన్సీ నోట్ల చలామణి మార్చి-ఏప్రిల్ నాటికి ఆర్‌బిఐ వాటిని రద్దు చెయబోతున్నట్లు యోచిస్తున్నట్లు తెలిపారు.
undefined
అయితే కొత్త 100 రూపాయల కరెన్సీ నోట్లను 2019లో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది. డీమోనిటైజేషన్ కాలంలో కనిపించిన గందరగోళాన్ని నివారించడానికి పాత నోట్ల చెలామణిని ఉపసంహరించుకోవడానికి ఆర్‌బి‌ఐ అనుకూలంగా లేదు. వ్యవస్థను క్రమబద్ధంగా ఉంచడానికి, అపెక్స్ బ్యాంక్ మార్కెట్లో కొత్త నోట్లను తీసుకువస్తోంది.
undefined
2019 లో ఆర్‌బిఐ లావెండర్ కలర్‌లో కొత్త రూ .100 నోట్లను విడుదల చేసింది. ఇంతకుముందు జారీ చేసిన అన్ని పాత రూ .100 నోట్లు కూడా లీగల్ టెండర్‌గా కొనసాగుతాయి" అని సెంట్రల్ బ్యాంక్ కొత్త రూ .100 నోట్ల జారీ చేసే ముందు ప్రకటించింది. ఆర్‌బిఐ నవంబర్ 8, 2016న డీమోనిటైజేషన్ తర్వాత రూ .2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్‌తో పాటు రూ .200 నోటును ప్రవేశపెట్టింది.
undefined
ఆర్‌బి‌ఐ ఒక ప్రశ్నకు సమాధానంగా 2019లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను నిలిపివేసిందని తెలిపింది. ఎటిఎంల ద్వారా లభించే తక్కువ రూ .2000 నోట్లకు ఇది ఒక వివరణ.
undefined
రూ .10 నాణెం గురించి మాట్లాడుతూ, రూ .10 నాణెం ప్రవేశపెట్టి 15 సంవత్సరాల తరువాత కూడా ఈ నాణెంను వ్యాపారులు, వ్యాపారవేత్తలు అంగీకరించలేదు, ఇది బ్యాంకులు, ఆర్‌బిఐకి సమస్యగా మారింది. నాణెం చుట్టూ అనేక పుకార్లు వెలువడ్డాయి, దాని వాలిడిటీ గురించి ప్రజలలో సందేహాన్ని సృష్టించింది. రూపాయి చిహ్నం లేని రూ .10 నాణెం తీసుకోవడానికి వ్యాపారులు, దుకాణదారులు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణెంపై ప్రజల్లో అవగాహన కల్సించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
undefined
ఒకవేళ ఊహించినట్టుగానే మార్చ్ తరువాత పాత రూ .100, రూ .10, రూ .5 కరెన్సీ నోట్ల రద్దు చేస్తే మరి పాత నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఇస్తుంది అనేదానిపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అమలు చేయనున్న సమగ్ర ప్రణాళిక, విధివిధానాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
undefined
ఇది ఇలా ఉండగా 2వేల నోటును కూడా రద్దు చేయనుందనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్రం, ఆర్‌బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
undefined
click me!