Tata Chairman New House: రూ.98 కోట్లతో డుప్లెక్స్ ఫ్లాట్ కొన్న టాటా చైర్మన్ చంద్రశేఖరన్..హైలైట్స్ ఇవే..

Published : May 07, 2022, 02:40 PM IST

Tata chairman buys duplex for Rs 98 crore:  టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని లగ్జరీ టవర్ '33 సౌత్'లో డూప్లెక్స్ కొనుగోలు చేశారు. ఈ భవనానికి సమీపంలోనే ముఖేష్ అంబానీ ఇల్లు 'యాంటిల్లా' ఉండటం విశేషం. మొత్తం ఈ డీల్ విలువ రూ.98 కోట్లుగా భావిస్తున్నారు.

PREV
16
Tata Chairman New House: రూ.98 కోట్లతో డుప్లెక్స్ ఫ్లాట్ కొన్న టాటా చైర్మన్ చంద్రశేఖరన్..హైలైట్స్ ఇవే..

టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. ముంబైలోని పెద్దార్ రోడ్ లగ్జరీ టవర్‌లో చంద్రశేఖరన్ రూ.98 కోట్ల విలువైన డూప్లెక్స్‌ను కొనుగోలు చేశారు. ఇది ప్రాపర్టీ మార్కెట్‌లో పెద్ద హై ప్రొఫైల్ డీల్‌గా పరిగణిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ 28-అంతస్తుల భవనం దక్షిణ ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ సమీపంలో ఉంది. అంతేకాదు ఈ భవనానికి సమీపంలోనే ముఖేష్ అంబానీకి చెందిన యాంటిల్లా భవనం ఉండటం విశేషం.  
 

26

ఇదిలా ఉంటే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గత ఐదేళ్లుగా అద్దెకు జీవిస్తున్న డూప్లెక్స్‌ ఫ్లాట్ కే ఇప్పుడు యజమాని అయ్యారు. పెద్దార్ రోడ్డులో ఉన్న 33 సౌత్ అనే లగ్జరీ టవర్‌లో 11వ, 12వ అంతస్తులలో డ్యూప్లెక్స్ ఫ్లాట్ ని ఆయన కొనుగోలు చేశాడు. మొత్తం రూ. 98 కోట్లకు ఈ డీల్ జరిగింది. ఇప్పటి వరకు, చంద్రశేఖరన్  ఆయన కుటుంబం దాదాపు 6,000 చదరపు అడుగుల ఈ డూప్లెక్స్‌కు నెలకు రూ. 20 లక్షల అద్దె చెల్లిస్తు నివసిస్తున్నారు. 2021లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఎన్‌ చంద్రశేఖరన్‌  నివసించే '33 సౌత్' భవనం పక్కనే ముఖేష్ అంబానీ విలాసవంతమైన ఇల్లు 'యాంటిలియా' ఉండటం విశేషం. 33 సౌత్ లేదా పెద్దార్ రోడ్ ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా పేరుంది. 
 

36

ఈ ఒప్పందం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం. చంద్రశేఖరన్ కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ఈ అపార్ట్ మెంట్లోనే నెలకు రూ. 20 లక్షల అద్దె చెల్లిస్తూ ఇక్కడ నివసిస్తోంది. ఫిబ్రవరి 21, 2017న టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రశేఖరన్ 33 సౌత్ బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు.  గతేడాది దాదాపు రూ.91 కోట్ల వేతనం ఆయన అందుకున్నారు. ఆయన దేశంలోనే అత్యధిక వేతనం పొందుతున్న కార్పొరేట్ బాస్ లలో ఒకరు.
 

46

చంద్రశేఖరన్ మళ్లీ టాటా సన్స్ చైర్మన్‌ అయినప్పటి నుంచి ఈ డూప్లెక్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. మరో ఐదేళ్లపాటు అంటే ఫిబ్రవరి 20, 2027 వరకు ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. 
 

56
డూప్లెక్స్ ఫ్లాట్ ఖరీదు 98 కోట్లు..

6 వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న డూప్లెక్స్ కోసం చంద్రశేఖరన్ రూ.98 కోట్లు చెల్లించారు. అంటే ఒక చదరపు అడుగుకు 1.6 లక్షల రూపాయలు. చంద్రశేఖరన్, అతని భార్య లలిత, కుమారుడు ప్రణవ్ పేరుతో మూడు రోజుల క్రితం డీల్ కుదిరింది. డ్యూప్లెక్స్‌ను విక్రయిస్తున్న సంస్థ జీవేష్ డెవలపర్స్ లిమిటెడ్, దీనిని బిల్డర్ సమీర్ భోజ్వానీ నిర్వహిస్తున్నారు. ఈ టవర్‌ను భోజ్వానీ, వినోద్ మిట్టల్ 2008లో నిర్మించారు.

66

ముంబైలో ఇంత భారీ విలువైన లావాదేవీలు చాలా అరుదుగా కనిపిస్తాయని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్‌పై ఒక నిపుణుడు మాట్లాడుతూ నగరంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను  పూర్తిగా విక్రయించబడటానికి 15 సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. లగ్జరీ అపార్ట్‌మెంట్ల వార్షిక విక్రయ రేటు 25 యూనిట్లు అని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులను కొనుగోలు చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిపారు. నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా ప్రకారం, జనవరి 2022 నుండి ముంబైలో కేవలం 13 లగ్జరీ అపార్ట్ మెంట్స్ లావాదేవీలు మాత్రమే జరిగాయి.

Read more Photos on
click me!

Recommended Stories