దేశీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ ధరలను నియంత్రించేందుకు భారత్ కొన్ని నూనెలపై పన్ను తగ్గించాలని యోచిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం మరియు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం తర్వాత ధరలు పెరిగినందున, భారత ప్రభుత్వం త్వరలో కొన్ని చర్యలు తీసుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.
భారతదేశం ప్రపంచంలోనే వంట నూనెల దిగుమతిదారుగా ఉంది. పామాయిల్ దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను 5 శాతానికి తగ్గించే ఆలోచనలో ఉంది. అయితే ఎంతమేరకు పన్ను తగ్గింపు అనేది ఇంకా పరిశీలనలో ఉంది.
28
ప్రాథమిక పన్ను రేట్లపై సెస్ విధించి వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముడి పామాయిల్‌పై బేస్ దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. నివేదిక ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి దీనిపై వ్యాఖ్యానించలేదు. వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖలు కూడా వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేవు.
38
భారతదేశం 60 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది
వంట నూనె ధరల పెరుగుదల భారతదేశంపై అత్యధిక ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే మన అవసరాలలో 60 శాతం దిగుమతులపై ఆధారపడతాము. గత రెండేళ్ల నుంచి ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మరియు ఇండోనేషియా దేశీయ మార్కెట్‌ను రక్షించడానికి తీసుకున్న చర్యలు పామాయిల్ ధరలను పెంచాయి.
48
ధరలను నియంత్రించేందుకు భారత్ ఈ చర్యలు చేపట్టింది
పామ్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించడం, బ్లాక్ మార్కెట్లో నిల్వలను నిరోధించడానికి నిల్వలను పరిమితం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఈ చర్యలు విజయవంతం కాలేదు.
58
కనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే, ఎడిబుల్ ఆయిల్స్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
68
విదేశీ మార్కెట్లలో తగ్గి వస్తున్న ధరలు...
విదేశీ మార్కెట్లలో నూనె గింజల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవాలు, వేరుసెనగ నూనె , సోయాబీన్ ఆయిల్ ధరలు శుక్రవారం ఢిల్లీ మార్కెట్‌లో క్షీణించాయి.. సోయాబీన్ నూనె గింజల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీటి ధరలు మునుపటి స్థాయిలోనే ఉన్నాయి. సోయాబీన్ గింజల ధర ప్రస్తుతం చికాగో ఎక్స్ఛేంజ్ మార్కెట్లో1.5 శాతం క్షీణించగా, మలేషియా ఎక్స్ఛేంజ్ ఐదు శాతం నష్టపోయినట్లు ట్రేడర్లు తెలిపారు.
78
దిగుమతి సుంకం తగ్గించడం పరిష్కారం కాదు..నిపుణులు
ఎడిబుల్ ఆయిల్ లభ్యతను పెంచేందుకు దిగుమతి సుంకాన్ని తగ్గించడం మానుకోవాలని, అందుకు బదులుగా ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిపై భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతున్నందున నూనె గింజల ఉత్పత్తిని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు, విదేశాలలో మాత్రం అందుకు అనుగుణంగా ఎడిబుల్ ఆయిల్ ఎగుమతి సుంకాన్ని పెంచుతున్నారని, ఇది వినియోగదారులకు ప్రయోజనం కలిగించదని నిపుణులు భావిస్తున్నారు.
88
విద్యుత్ సంక్షోభంతో ఆయిల్ మిల్లుల్లో ఉత్పత్తికి ముప్పు...
విద్యుత్ సంక్షోభ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లో కరెంటు కోత గురించి చర్చ జరుగుతోందని, అయితే ఆయిల్ మిల్లులను ఈ కోత పరిధి నుండి తప్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎందుకంటే నూనెగింజల తాజా పంట అందుబాటులోకి వచ్చింది. అటు ఆయిల్ క్రషింగ్ పనులు పూర్తి స్వింగ్‌లో జరుగుతున్నాయి. కరెంటు కోతల వల్ల ఎడిబుల్ ఆయిల్స్ సంక్షోభం పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.