వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ ధరను రూ .3 తగ్గిస్తు ప్రభుత్వం ప్రకటన..

First Published Aug 13, 2021, 2:45 PM IST

చెన్నై: వాహనదారులకు   తమిళనాడు ప్రభుత్వం భారీ ఉపశమనం అందించింది. పెట్రోల్ ధరలను లీటరుకు రూ .3 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎం.కే. స్టాలిన్ ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పిటి పళనివేల్ త్యాగరాజన్ ధర తగ్గింపును ప్రకటించారు. 

పెట్రోల్ ధర లీటరుకు రూ .3 తగ్గిస్తే రాష్ట్రం రూ .1,160 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.  గత కొద్దిరోజులుగా ఇంధన ధరలు  రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49, డీజిల్ ధర రూ. 94.39గా ఉంది.  పెట్రోల్ అసలు  ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ  వాటి పన్నులను జోడిస్తాయి. ఇందులో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. 
  

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పన్నులను తగ్గించదని గతంలో ఆర్థిక మంత్రి విలేకరులతో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినప్పుడే పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గుతుందని ఆయన అన్నారు. 

ఇదిలా ఉండగా డీఎంకే ఎన్నికల సమయంలో పెట్రోల్ పై రూ .5, డీజిల్ రూ .4 తగ్గిస్తామని హామీ ఇచ్చింది. కానీ మేనిఫెస్టోలోని వాగ్దానం పూర్తిగా నిలబెట్టుకోకపోయినా మూడు రూపాయలు తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడం సామాన్యుడికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలును  41 సార్లు  పెరిగాయి. దీంతో దేశంలోని అన్ని మెట్రోలలో  పెట్రోల్ ధర లీటరుకు రూ .100కి పైగా చేరాయి.

click me!