విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మరింత ఖరీదైనదిగా దేశీయ విమాన ఛార్జీలు..

First Published Aug 13, 2021, 1:57 PM IST

ఇప్పుడు మీరు ఇండియాలో విమాన ప్రయాణం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి నుండి విమానయాన సంస్థల కనీస, గరిష్ట ఛార్జీలను 12.5 శాతం పెంచింది. 

అలాగే దీనితో పాటు మరికొన్ని  దేశీయ విమానాలను ప్రభుత్వం ఆమోదించింది, ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని 72.5 శాతానికి పెంచింది.  విశేషమేమిటంటే జులై 5 నుండి దేశీయ విమానాలు  65 శాతం సామర్థ్యంతో ప్రయాణిస్తున్నాయి. కరోనా కారణంగా  జూలై 5 వరకు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే ప్రయాణించడానికి మంత్రిత్వ శాఖ అనుమతించింది.
 

ముంబై నుండి ఢిల్లీ ఛార్జీలు

పెరిగిన ధరల తరువాత  ఢిల్లీ నుండి ముంబై మధ్య కనీస వన్-వే ఛార్జీ రూ.4700 నుండి రూ.5287 కి పెరిగింది. అలాగే గరిష్ట ఛార్జీ రూ.13000 నుంచి రూ.14625 కి చేరుకుంది. వాహన ఇంధనం ధరలు పెరిగిన తరువాత ఒక సంవత్సరంలో ప్రభుత్వం పెంచడం ఇది నాలుగోసారి. 

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విమానయాన కంపెనీలు

ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం ఇంకా  కరోనా కారణంగా విమానయాన సంస్థలు  ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా ప్రభుత్వం విమాన ప్రయాణ ఛార్జీలను పెంచింది. ఇందులో ప్రయాణీకుల భద్రతా రుసుము రూ.150, జి‌ఎస్‌టి ఉండదు.

కరోనా కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ తరువాత, ప్రభుత్వం మే 25న మూడవ వంతు సామర్థ్యంతో విమాన ప్రయాణాలని అనుమతించింది. దీనితో పాటు ప్రయాణీకుల నుండి ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేయబడకుండా ఛార్జీలను నిర్ణయించాలని ప్రభుత్వం విమానయాన కంపెనీలకు ఆదేశాలు కూడా ఇచ్చింది. 
 

click me!