ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం వీరు ఎంత తీసుకుంటున్నారో తెలుసా.. ?

First Published | Dec 20, 2023, 7:35 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు వారి నటనతో ఎంతో మంది ఫ్యాన్స్  హార్ట్ కొల్లగొడుతున్నారు. సినిమాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్  ఉన్న ఈ స్టార్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి వారు ఎంత వసూలు చేస్తున్నారో  తెలుసా..?
 

టాలీవుడ్ తో పాటు యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లో మంచి  గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. ఈ నటికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. నివేదికల ప్రకారం, రష్మిక ఒక్కో పోస్ట్‌కు రూ.20-30 లక్షలు తీసుకుంటుందట.
 

విజయ్ దేవరకొండ:
సౌత్ హ్యాండ్సమ్ యాక్టర్ విజయ్ దేవరకొండ బ్రాండ్స్  ఫేవరెట్ ఛాయిస్. నివేదికల ప్రకారం, అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆదాయం  రూ. 1-2 కోట్లు అని అంచానా. 


సమంతా రూత్ ప్రభు:
సమంతా రూత్ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో 31.1 మిలియన్లకు పైగా ఫాలోవర్స్  ఉన్నారు. మూలాల ప్రకారం, ఆమె రూ. 15 నుండి  25 లక్షల మధ్య సంపాదిస్తుంది అని సమాచారం. 

మహేష్ బాబు:
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్ లో సుపరిచితమైన పేరు. మహేష్ బాబు ఎన్నో  వ్యాపారాలను ఎండార్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటాడు. ఒక్కో పోస్టుకు రూ.1-2 కోట్లు  అందుకుంటున్నట్లు సమాచారం.
 

పూజా హెగ్డే : 
సౌత్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. నివేదికల ప్రకారం, ఆమె  ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రూ. 30 నుండి  50 లక్షలు.

కాజల్ అగర్వాల్:
నటి కాజల్ అగర్వాల్‌కి సోషల్ మీడియాలో 26.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. పలు ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటున్న కాజల్.. ఒక్కో పోస్ట్ కోసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి అని అంచనా

Latest Videos

click me!