పెట్రోల్ డీజిల్ అసలు ధర ఎంత..? ఇంత ఎక్కువ రేటు ఎందుకో తెలుసా..

First Published | Dec 20, 2023, 3:28 PM IST

అంతర్జాతీయంగా ముడిచమురు(crudeoil)  ధర పెరిగినప్పటికీ,  ఇంధన ధరల్లో మాత్రం ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం, నవంబర్ 2021 నుండి నవంబర్ 2023 మధ్య అమెరికాతో సహా ఇతర దేశాలలో పెట్రోల్  డీజిల్ ధరలు పెరిగాయి, అయితే భారతదేశంలో కాస్త తగ్గాయి. 
 

ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి
దేశం        డీజిల్    పెట్రోల్
శ్రీలంక     118%       54%
పాకిస్తాన్    54%       41%
నేపాల్       41%       29%
బంగ్లాదేశ్   44%        24%
అమెరికా    28%         09%
జర్మనీ       19%         11%
 యుకె       10%          07%
ఇండియా   -9%          -12%
 

పెట్రోల్ ధరలు ఎలా నిర్ణయిస్తారు?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధర నిర్ణయించబడుతుంది. చమురు కంపెనీలు గత 15 రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో సగటు ధరలను పరిశీలించి దాని ప్రకారం ధరలను నిర్ణయిస్తాయి. అంటే ముడిచమురు ధర పెరిగినా, తగ్గినా సామాన్య ప్రజల జేబులపై ప్రభావం చూపుతుంది. 


అనేక రకాల పన్నుల కారణంగా ధరలు 
నిజనికి దేశీయ మార్కెట్‌లో ధరలను పెంచడంలో ఈ ఉత్పత్తులపై విధించే పన్నులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెట్రోలు ధర పెంపునకు స్థానికంగా పన్నులు అధికంగా వసూలు చేయడం కూడా ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ వినియోగదారునికి చేరకముందే  కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పన్నులు విధిస్తున్నంది.  మొదట, దానిపై ఎక్సైజ్ సుంకం ఇంకా సెస్ విధించబడుతుంది, దీని పై  నుండే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
 

రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్  
అంతే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను(sales  tax ) లేదా వ్యాట్ (vat)వసూలు చేస్తాయి. ఆ తర్వాత సరుకు రవాణా, డీలర్ కమీషన్, విలువ ఆధారిత పన్ను కలుపుతారు. ఉదాహరణకు, ఢిల్లీలో పెట్రోల్ ధరను పరిగణిస్తే ఇక్కడ లీటరు పెట్రోల్‌ బేస్‌ ధర రూ.57.15. సరకు రవాణా లీటరుకు రూ.0.20, ఎక్సైజ్ సుంకం రూ.19.90, డీలర్ కమీషన్ (సగటు) లీటరుకు రూ.3.76, వ్యాట్ (డీలర్ కమీషన్‌పై వ్యాట్‌తో కలిపి) రూ.15.71. వీటన్నింటిని కలుపుకుంటే ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ.96.72కు లభిస్తోంది. 

ధరను ఎవరు నిర్ణయిస్తారు?
భారతదేశం దేశీయ చమురు డిమాండ్‌ను ప్రధానంగా దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా బయట నుండి దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధరను అంతర్జాతీయ స్థాయిలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) నిర్ణయిస్తుంది. ఒపెక్ నిర్ణయించిన ధరకే భారత్ కూడా ముడి చమురును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం నిర్ణయిస్తాయి. దీనితో పాటు రష్యా నుండి కూడా భారతదేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది.

Latest Videos

click me!