మీరు వాహనంలో పెట్రోల్ బంకుకి వెళ్తున్నారా.. జాగ్రత్త లేదంటే జరిమానా తప్పదు..

First Published Oct 19, 2021, 7:30 PM IST

మీరు మీ వాహనంలో ఇంధనం నింపేందుకు పెట్రోల్ బంకు(petro bunk)కి వెళ్తున్నారా.. ఇంటి నుండి బయలుదేరే ముందు జాగ్రత్త వహించండి. ఒకవేళ మీరు ఇలా చేయడంలో విఫలమైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచడానికి ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ పంపుల వద్ద కూడా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

మీరు PUC (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్‌ను మీ వద్ద లేకపోతే మీరు రూ. 10వేల చలాన్ చెల్లించాల్సి ఉంటుంది.

మీడియా నివేదికల ప్రకారం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ PUC సర్టిఫికేట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సంబంధిత డిపార్ట్‌మెంట్ ప్రత్యేక క్యాంపైన్ ప్రారంభించిందని చెప్పారు. దీని కింద రవాణా శాఖ బృందాలు పెట్రోల్ పంపుల వద్ద మోహరించనున్నాయి, వీరు ఇంధనం (fuel)కోసం వచ్చే వాహనాల కాలుష్య ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేస్తారు. అలాగే పొల్యూషన్  సర్టిఫికెట్ లేని వారికి రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. 

అక్టోబర్ 14 వరకు 17,71,380 వాహనాలు ఎలాంటి కాలుష్య ధృవీకరణ పత్రం లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. వీటిని అధిగమించడానికి పెట్రోల్ పంపుల వద్ద 500 బృందాలను డిపార్ట్‌మెంట్ మోహరించింది. కాలుష్య ధృవీకరణ పత్రం అందుబాటులో లేని వాహనాలకు వాటిని సమర్పించడానికి 24 గంటల సమయం లభిస్తుందని ఆయన అన్నారు. దీని తరువాత ఆ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్  ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేయబడుతుంది. కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాల ఇళ్లకు ఇ-చలాన్ పంపబడుతుంది. 
 

ఈ ప్రచారం ఒక నెల పాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ప్రజలలో అవగాహన, రూల్ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. క్యాంపైన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పర్యవేక్షించబడుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్‌లపై చర్యలు కూడా తీసుకోబడతాయి. అయితే ఈ నియమం పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి  ఢిల్లీ (delhi)రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 

click me!