ఇంటర్ పాసైన వ్యక్తి 5 వేలతో పెట్టుబడి.. నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..

First Published Aug 19, 2021, 3:14 PM IST

 సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో పెరిగిన ఇంటర్ పాసైన వ్యక్తి కష్టతరమైన రహదారి కూడా సులభం అవుతుందని ప్రపంచానికి చెప్పాడు. ఈ రోజు ప్రపంచంలో 98వ ధనవంతుడిగా ఎదిగాడు. అతనెవరో కాదు ప్రముఖ రిటైల్ కంపెనీ డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని, అతని గురించి  కొన్ని  ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం... 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతను నేడు రూ .1.42 లక్షల కోట్ల నికర విలువ కలిగిన అధినేత. 5వేలతో పెట్టుబడి పెట్టి ప్రారంభించిన ఈ 'రిటైల్ కింగ్'  సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం...

రాధాకిషన్ దమాని కథ ఎక్కడ మొదలైంది?

రాధాకిషన్ దమాని తండ్రి స్టాక్ బ్రోకర్. 1985-86లో తన తండ్రి శివకిషన్ దమాని మరణించిన తరువాత రాధాకిషన్ దమాని నష్టాల్లో ఉన్న బాల్ బేరింగ్ వ్యాపారాన్ని మూసివేసాడు. దీని తరువాత అతను తన సోదరుడు గోపికిషన్ దమానితో కలిసి స్టాక్ మార్కెట్‌పై  దృష్టి పెట్టాడు. మొదట రూ. 5000 తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. 1990లలో హర్షద్ మెహతా దేశ ఆర్థిక మార్కెట్లను దారుణంగా షేక్ చేసినప్పుడు రాధాకిషన్ దమాని భారీ లాభాలను ఆర్జించాడు. 

 ఆ సమయంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో పెరుగుదలపై పందెం వేయగా, రాధాకిషన్ దమాని మార్కెట్ పతనంపై పందెం వేసుకున్నారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది దీంతో రాధాకిషన్ దమాని భారీ లాభాలను ఆర్జించాడు. నివేదికల ప్రకారం  1995లో చౌకైనా వాల్యుయేషన్‌తో అందుబాటులో ఉన్న కంపెనీలో సుదీర్ఘకాలం ఉండాలనే ఫార్ములాను అనుసరించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) లో రాధాకిషన్ దమాని డబ్బు పెట్టుబడి పెట్టారు. అతను దీని నుండి భారీ కూడా  లాభాలు పొందాడు.

దమాని జీవితం

రాధాకిషన్ దమాని 1954లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. అతని కుటుంబం ఒకే గది ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసించేది. ఇక్కడే అతను ముంబై యూనివర్సిటీలో కామర్స్ లో చేరాడు, కానీ మొదటి సంవత్సరంలోనే నిష్క్రమించాడు. 2002లో అతను డి-మార్ట్  మొదటి స్టోర్‌ను ప్రారంభించాడు తరువాత 2017లో డి-మార్ట్  మాతృ సంస్థ అవెన్యూ సైపర్‌మార్ట్  ఐపిఒలోకి వచ్చింది, ఆ తర్వాత కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యింది.
 

2002లో డి-మార్ట్  మొదటి స్టోర్

2002లో ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో డి-మార్ట్  మొదటి స్టోర్‌ను దమాని ప్రారంభించాడు. అప్పటి నుండి అతని కంపెనీ స్టోర్లు నిరంతరం పెరుగుతు ఊన్నాయి. డి-మార్ట్‌కి  2011-12లో 55 స్టోర్లు, 2012-13లో 62 స్టోర్లు, 2013-14లో 75 స్టోర్లు, 2014-15లో 89 స్టోర్లు, 2015-16లో 110 స్టోర్లు, 2016-17లో 131 స్టోర్లు, 2017-18 నుండి  2018-19లో 214 స్టోర్లు,  నేడు కంపెనీకి 11 రాష్ట్రాలలో 238 స్టోర్లు  ఉన్నాయి. డి-మార్ట్ స్టోర్‌లు  అన్ని  కంపెనీకి చెందినవి ఒక్కటి కూడా అద్దెకు లేదు.  

దమాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

రాధాకిషన్ దమాని బట్టల విషయంలో  గందరగోళాన్ని నివారించడానికి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులను ధరిస్తారు. ఈ కారణంగా అతడిని 'మిస్టర్ వైట్ అండ్ వైట్' అని కూడా పిలుస్తారు. మీడియా నివేదికల ప్రకారం అతను పూర్తిగా శాకాహారి. గుడ్లు, మాంసం, తేనె, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోరు. అవెన్యూ సైపర్‌మార్ట్  ఐ‌పి‌ఓ 2017లో ప్రవేశపెట్టరు.  అప్పుడు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .39000 కోట్లు.
 


కొంతకాలం క్రితం దమణి దక్షిణ ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో రూ .1001 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఇది దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలో ఒకటి. ఇందుకు మార్చి 31న 3% స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.  ఈ ఒకటిన్నర ఎకరాల బంగ్లా కోసం అతను చదరపు అడుగుకి రూ .1.60 లక్షలు చెల్లించాడు. 
8.8 ఎకరాల భూమిని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో సి‌సి‌ఐ ప్రాజెక్ట్‌ల కింద 2020లో రాధాకిషన్ దమాని 500 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసారు.

మార్చి 2020 నాటికి దమానికి  ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌లో  15.16 శాతం వాటా కలిగి ఉన్నారు. 31 మార్చి 2020 నాటికి రాధాకృష్ణ దమాని ఇండియా సిమెంట్స్‌లో 3,18,86,777 షేర్లను కలిగి ఉన్నారు. అంటే మొత్తం వాటాలో 10 శాతం. దమానీ కుటుంబం డిసెంబర్ 2019 నాటికి ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటా ఉంది. 
 

గత నాలుగు సంవత్సరాలలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 

 సంవత్సరం               ఆదాయం    లాభం
2016-17         ఆర్థిక సంవత్సరం    11881    483
2017-18         ఆర్థిక సంవత్సరం    15009    785
2018-19         ఆర్థిక సంవత్సరం    19916    936
2019-20         ఆర్థిక సంవత్సరం    24675    1350
FY 2020-21                                    23787    1165
(కోట్ల రూపాయల్లో గణాంకాలు)

click me!