ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో డి-మార్ట్ వ్యవస్థాపకుడు.. ఇతని సంపద ఎంతో తెలుసా ?

First Published Aug 19, 2021, 1:24 PM IST

ప్రముఖ రిటైల్ కంపెనీ డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల  100 మంది జాబితాలో చేరారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రాధాకిషన్ దమాని 1.42 లక్షల కోట్ల (19.2 బిలియన్ డాలర్లు) నికర విలువతో 98వ స్థానంలో ఉన్నారు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల డైలీ ర్యాంకింగ్ లో  దమనీతో పాటు మరికొందరు భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్  అధినేత గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్  పల్లోంజి మిస్త్రీ, హెచ్‌సి‌ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ నాదర్, ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్  లక్ష్మీ మిట్టల్  ఉన్నారు.
 

రాధాకిషన్ దమాని  కంపెనీ రెవెన్యూ

జూన్ త్రైమాసికంలో  సంస్థ నికర లాభం 132 శాతం పెరిగి రూ 115 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ .50 కోట్లు. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 31 శాతం పెరిగి రూ. 5,032 కోట్లకు చేరింది. జూన్ 2020 త్రైమాసికంలో  రూ. 3,833 కోట్లుగా ఉంది. ఈ కాలంలో సంస్థ  EBITDA (వడ్డీ, పన్నులు, డివాల్యుయేషన్  ఇతర) రూ. 221 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం రూ .109 కోట్లుగా ఉంది. కంపెనీ EBITDA మార్జిన్ గత సంవత్సరం 2.8 శాతం నుండి 4.4 శాతంగా ఉంది. 

మార్కెట్ క్యాపిటలైజేషన్

ప్రస్తుతం బి‌ఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్‌ల వాటా 3651.55 స్థాయిలో ఉంది. గత సెషన్‌లో 19.05 పాయింట్లు (+0.52 శాతం) లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .2,36,538.17 కోట్లు.
 

ఇటీవల రాధాకిషన్ దమాని సౌత్ ముంబై  మలబార్ హిల్స్ ప్రాంతంలో ఒక బంగ్లాని  రూ 1,001 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికోసం దమాని మార్చి 31న 3% స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. మినహాయింపు తర్వాత కూడా అతను 30 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాడు. ఈ ఒకటిన్నర ఎకరాల బంగ్లా కోసం అతను చదరపు అడుగుకు రూ .1.60 లక్షలు చెల్లించాడు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో సి‌సి‌ఐ ప్రాజెక్ట్‌ల కింద 2020లో దమాని 500 కోట్ల విలువైన  8.8 ఎకరాల భూమిని  కొనుగోలు చేశారు.

दमानी अब सिर्फ मुकेश अंबानी से ही पीछे हैं, जो भारत ही नहीं बल्कि एशिया के सबसे अमीर शख्स हैं। शुक्रवार को दमानी की संपत्ति 96 मिलियन डॉलर पहुंच गई। मुकेश अंबानी के पास 57.9 बिलियन डॉलर की दौलत है। गुरुवार को कंपनी के शेयरों में 0.54 फीसदी का उछाल आया, जिसके बाद उनकी दौलत में यह बढ़ोतरी दर्ज की गई है। बीएसई सूचकांक में गुरुवार को एवेन्यू सुपरमार्केट्स का शेयकर 2,559 रुपये के अपने उच्चतम स्तर पर था।
undefined
click me!