చివరకి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,688 పాయింట్లు లేదా 2.87 శాతం పడిపోయి 57,107 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 510 పాయింట్లు లేదా 2.9 శాతం పడిపోయి 17,026 వద్ద ముగిసింది.
ఈ రోజు ట్రేడింగ్‌ను పరిశీలిస్తే రెండు సూచీలు నష్టాలలో ప్రారంభమైన కొద్దిసేపటికే భారీగా పడిపోయాయి. ఉదయం 10.35 గంటల సమయానికి సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. దీని తరువాత, సెన్సెక్స్ ఉదయం 11 గంటల వరకు 1460 పాయింట్లు జారిపోయి కనిష్ట స్థాయికి చేరుకుంది.
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కనుగొనబడిన తర్వాత పెట్టుబడిదారుల ఆందోళనలు కూడా పెరిగాయి. కొత్త వేరియంట్ B.1.1529 డెల్టా కంటే ప్రమాదకరమైనదని, దక్షిణాఫ్రికాలో 30 కంటే ఎక్కువ కొత్త కేసులు కనుగొనడంతో శాస్త్రవేత్తలు హెచ్చరించారు.