స్టాక్ మార్కెట్ క్రాష్: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 1400, నిఫ్టీ 400 పాయింట్లు డౌన్..

First Published Nov 26, 2021, 3:17 PM IST

బలహీనమైన ప్రపంచ సూచనల ప్రభావం, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్(corona virus) వ్యాప్తి  ప్రభావం స్టాక్ మార్కెట్‌(stock market)లో స్పష్టంగా కనిపిస్తుంది. నేడు స్టాక్ మార్కెట్ లో మరోసారి ప్రకంపనలు చెలరేగాయి. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్(sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (nifty)సూచీలు భారీగా క్షీణించాయి. నష్టాలలో  ట్రేడింగ్‌ను పునఃప్రారంభించిన కొద్దిసేపటికే రెండు సూచీలు భారీగా క్షీణించాయి

 ఉదయం 10.35 గంటల సమయానికి సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. దీని తర్వాత సెన్సెక్స్ ఉదయం 11 గంటల వరకు 1460 పాయింట్లు జారిపోయింది. కాసేపటికి సెన్సెక్స్ 1381.82 పాయింట్లు లేదా 2.33 శాతం క్షీణించి 57,423.55 వద్ద ట్రేడైంది, నిఫ్టీ 395.05 పాయింట్లు లేదా 2.27 శాతం క్షీణించింది. . 

బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 
వారంలోని ఐదవ ట్రేడింగ్ రోజున నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్ చాలా ఘోరంగా ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ నష్టాలలో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ డేలో సెన్సెక్స్ 815.71 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టపోయి 58 వేల దిగువన ప్రారంభమై 57979.38 స్థాయిలో ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 239.60 పాయింట్లు లేదా 1.37 శాతం నష్టంతో 17296.65 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 

గురువారం స్టాక్ మార్కెట్‌ లాభాలతో ముగిసింది. నిఫ్టీ కూడా 121.20 పాయింట్లు లేదా 0.70 శాతం జంప్‌ చేసి 17536.25 వద్ద ముగిసింది. 

కరోనా వైరస్ పెట్టుబడిదారుల ఆందోళనలను మరింత పెంచుతుంది దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త రూపాంతరం పొందిన తరువాత పెట్టుబడిదారుల ఆందోళనలు కూడా పెరిగాయి. కొత్త వేరియంట్ B.1.1529 డెల్టా కంటే ప్రమాదకరమైనదని, దక్షిణాఫ్రికాలో 30 కంటే ఎక్కువ కేసులు కనుగొనబడిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచ పునరుద్ధరణకు ఇది పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. 

విదేశీ మార్కెట్లపైనా ప్రభావం కనిపిస్తోంది
కోవిడ్-19  కొత్త వేరియంట్ ప్రభావం గురించి  మాట్లాడినట్లయితే దాని ప్రభావం విదేశీ మార్కెట్లలో కూడా కనిపిస్తుంది. టోక్యోకు చెందిన నెక్కీ మూడు శాతం, హాంకాంగ్‌కు చెందిన హెంగ్ సెంగ్ 2.1 శాతం పడిపోయాయి. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ నుండి వచ్చే ప్రయాణికులను ఖచ్చితంగా పరీక్షించాలని అలాగే భారత ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కారణంగా దేశీయ మార్కెట్‌లోనూ భూకంపం కనిపిస్తోంది. 
 

stock market

స్టాక్ మార్కెట్‌లో మధ్యనం 2 గంటలకు మరోసారి భారీ కదలిక వచ్చింది. నష్టాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్‌లో నేడు అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో బీఎస్ఈలోని 30 షేర్ల సెన్సెక్స్ 1460 పాయింట్లు పడిపోయి కనిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ కూడా భారీగా క్షీణించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1381.82 పాయింట్లు లేదా 2.33 శాతం క్షీణించి 57,423.55 వద్ద, నిఫ్టీ 395.05 పాయింట్లు లేదా 2.27 శాతం నష్టంతో 17141.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిల ఉండగా పతనానికి గల కారణాలను పరిశీలిస్తే.. చివరి రోజు ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్‌ పతనానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.  

కోవిడ్-19 కొత్త వేరియంట్
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కనుగొన్నారు. ఈ వేరియంట్ తెరపైకి వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరినీ కరోనా  టెస్ట్ చేయాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రభావం పెట్టుబడిదారులపై కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఐరోపాలోని అనేక దేశాలలో ఆంక్షలు కఠినతరం అవుతున్నాయనే నివేదికల మధ్య వారు భయపడుతున్నారు. 

విదేశి ఇన్వెస్టర్ల విక్రయం
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ ( ఎఫ్‌పిఐ  ), అందుబాటులో ఉన్న డేటా ప్రకారం) దేశీయ మార్కెట్‌లో రూ. 2300.65 కోట్లు విక్రయించింది. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల కంటే ఎఫ్‌పిఐల విక్రయం ఎక్కువ. భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి అలాగే వారి ఉత్సాహాన్ని తగ్గించాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపిస్తోంది. 

ఆసియా మార్కెట్లలో బలహీనత 
అన్ని ఆసియా స్టాక్ మార్కెట్లలో క్షీణత కొనసాగుతోంది, దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, హ్యాంగ్ సెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పీ, షాంఘై కాంపోజిట్ 1 నుంచి 2 శాతం చొప్పున నష్టపోయాయి. టోక్యోకు చెందిన నెక్కీ 225 మూడు శాతం, హాంకాంగ్‌కు చెందిన హెంగ్ సెంగ్ 2.1 శాతం పడిపోయాయి.  

click me!